ఊహించని మలుపు తిరిగిన రాజ్‌తరుణ్ వివాదం.. బాంబు పేల్చిన మాల్వీ!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ కథానాయకుడిగా కొనసాగుతున్న రాజ్‌తరుణ్.. ఇద్దరు యువతుల వివాదం మధ్యలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యపై ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రస్తుతం రాజ్ తరుణ్ తో తిరగబడరా సామీ చిత్రంలో హీరోయిన్ గా చేస్తున్న మాల్వీ మల్హోత్రా ఈ ఫిర్యాదు చేశారు. తన సోదరుడికి లావణ్య సంక్షిప్త సందేశాలు పంపిస్తోందని, తనపై తప్పుడు ప్రచారం చేస్తోందనడంతో కేసు నమోదు చేశారు.

మాల్వీ మాయలో రాజ్ తరుణ్
హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మాయలో పడి తనను దూరం పెట్టాడంటూ లావణ్య అనే యువతి మీడియా ముందుకు వచ్చింది. తనను ప్రేమించి మోసం చేశాడంటూ ఆరోపించింది. రాజ్ తరుణ్ ను తాను వదలకపోతే మాల్వీ, ఆమె సోదరుడు కలిసి చంపేస్తామని బెదిరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో రాజ్ తరుణ్ కూడా లావణ్యపై కేసు పెట్టాడు. గతంలో ఆమెతో ప్రేమలో ఉన్నమాట వాస్తవమేనని, కానీ ఆమె మస్తాన్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోందన్నాడు. లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉందంటూ సంచలనమైన ఆరోపణ చేశాడు.

malvi malhotra files complaint against lavanya in raj tarun case

ఆమె చెప్పేదంతా అబద్దమే
లావణ్య చెప్పేదంతా అబద్దమేనని, రాజ్ తరుణ్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని, గడిచిన ఆరునెలల కాలంలో ఏనాడూ తనతో మాట్లాడింది కూడా లేదని మాల్వి స్పష్టం చేసింది. రాజ్ తరుణ్ తో కలిసి నటించే ప్రతి హీరోయిన్ ను ఆమె ఇలాగే వేధిస్తుంటుందని, తనకు కూడా సంక్షిప్త సందేశాలు పెట్టడం, ఫోన్ చేసి టార్చర్ చేయడంలాంటివన్నీ చేసిందని వెల్లడించింది. అలాగే తన కుటుంబ సభ్యులెవరూ లావణ్యను బెదిరించలేదని, తన పరువు, ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చేస్తున్న ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. తనను, తన తమ్ముడిని లావణ్యే బెదిరింపులకు గురిచేస్తోందని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+