రజనీకాంత్‌‌తో నటించి తప్పు చేశా.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

గత కొన్ని సంవత్సరాలుగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అవుతున్నాయి. ''జైలర్‌''ను మినయిస్తే.. మిగిలిన సినిమాలు ఆశించిన విధంగా ఆకట్టుకోలేకపోతున్నాయి. కబాలి, కలా, దర్బార్, పెద్దన్న వంటి సినిమాలు ఫ్లాప్‌లుగా నిలిచాయి. దీంతో రజినీకాంత్ సినిమాలపై ప్రేక్షకులకు ఆసక్తి తగ్గిపోయింది. ఇక తాజాగా రజనీకాంత్‌ నుంచి వచ్చిన ''లాల్ సలాం'' సినిమా పరిస్థితి ఇలానే ఉంది.

అసలు ''లాల్ సలాం'' అనే సినిమా ఒకటి వచ్చిందనే విషయం ప్రేక్షకులకు తెలియదంటే .. రజనీకాంత్‌ సినిమాల పరిస్థితి ఎంత దారుణంగా తయ్యారైందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు రజనీకాంత్‌ నుంచి సినిమా వస్తుందంటే తమిళ, తెలుగు రాష్ట్రాల్లో ఓ పండుగ వాతవరణం కనిపించేది. కాని ఇప్పుడు ఆ పరిస్థితికి పూర్తి విరుద్దంగా మారిపోయింది. రజనీకాంత్‌ స్టామినా తగ్గిపోవడంతో పాటు, యంగ్ హీరోలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడంతో సూపర్ స్టార్ హవా తగ్గిపోయిందనే చెప్పాలి.

mamatha mohan das shocking comments on rajinikanth

తెలుగులో అయితే రజనీకాంత్‌ మార్కెట్ రోజు రోజు తగ్గిపోతుంది. ''లాల్ సలాం'' కలెక్షన్లు చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా రజనీకాంత్‌‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రముఖ నటి, సింగర్ మోహన్ దాస్. సింగర్ కెరీర్ స్టార్ట్ చేసిన మోహన్ దాస్ ఆ తర్వాత హీరోయిన్‌గా మారి ఎన్టీఆర్, మంచు విష్ణు, నాగార్జున వంటి హీరోలతో నటించారు. కెరీర్ సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న సమయంలో

ఆమె క్యాన్సర్ బారిన పడ్డారు. ఆ తర్వాత తమిళ, మలయాళ చిత్రాల్లోనే నటిస్తూ బిజీగా నటిగా మారారు. ఇటీవల విజయ్ సేతుపతి నటించిన మహారాజా సినిమాలో నటించింది మమతా మోహన్ దాస్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్య్వూలో పాల్గొన్న మమతా మోహన్ దాస్ రజనీకాంత్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

కుసేలన్‌ మూవీలో ఓ పాట కోసం రజనీతో ఒప్పందం కుదుర్చుకుని 2 రోజుల పాటు కష్టపడి సాంగ్ చేసానని.. అయితే ఆ సినిమాలో నేను చేసిన పార్ట్ మొత్తం డిలీట్ అయింది. కేవలం ఆ పాటలో ఒక్క సెకను మాత్రమే కనిపిస్తానని.. అది చూసిన నాకు అసలు కుసేలన్ సినిమాలో ఎందుకు నటించానో అనిపించిందని సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రజనీకాంత్ సినిమాపై మమతా మోహన్ దాస్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+