Manasantha Nuvve: 25 ఏళ్ల తర్వాత మళ్లీ.. వాలెంటైన్స్ డే స్పెషల్ రీ రిలీజ్
ఆ పేరు వింటేనే గుండెల్లో ఏదో తెలియని మౌనం.. ఆ చిరునవ్వు చూస్తేనే ఒక తీయని జ్ఞాపకం. టాలీవుడ్ వెండితెరపై ప్రేమకావ్యాలకు చిరునామాగా నిలిచిన 'లవర్ బాయ్' ఉదయ్ కిరణ్, తన ఆరాధ్యులను పలకరించేందుకు మళ్లీ థియేటర్లలోకి వస్తున్నారు. సరిగ్గా పాతికేళ్ల కిందట తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన 'మనసంతా నువ్వే' చిత్రం, ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా రీ-రిలీజ్ కానుంది. మంచు కురిసే వేళలో.. మౌనమే పాటగా సాగే ఈ ప్రేమకథ మళ్లీ వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది.
టాలీవుడ్‌లో ప్రేమకథా చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో ఉదయ్ కిరణ్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రాల్లో 'మనసంతా నువ్వే' ఒకటి. వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రీమా సేన్ హీరోయిన్‌గా నటించగా, సుమంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎం.ఎస్. రాజు నిర్మించారు. 2001 అక్టోబర్ 19న విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. అనేక కేంద్రాల్లో 175 రోజులకు పైగా ప్రదర్శించబడుతూ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

సినిమాను క్లాసిక్ ప్రేమకథగా..
ఉదయ్ కిరణ్ - రీమా సేన్ జంటకు ప్రేక్షకులు విపరీతమైన ఆదరణ చూపించారు. ఆర్.పీ. పట్నాయక్ అందించిన సంగీతం, భావోద్వేగభరితమైన సన్నివేశాలు, హృదయాన్ని హత్తుకునే కథ - ఇవన్నీ కలిసివచ్చి సినిమాను క్లాసిక్ ప్రేమకథగా నిలబెట్టాయి. ఈ చిత్రంతో ఉదయ్ కిరణ్ 'లవర్ బాయ్' ఇమేజ్‌ను దాటి స్టార్ హీరో స్థాయికి చేరువయ్యారు.
ఇప్పుడు దాదాపు 25 ఏళ్ల తర్వాత, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ కల్ట్ లవ్ స్టోరీ మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ రీ-రిలీజ్ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహేష్ బాబును హీరోగా..
అందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే .. ఈ చిత్రానికి మొదటగా ఉదయ్ కిరణ్ ఎంపిక కాలేదట. ప్రారంభంలో నిర్మాత ఎం.ఎస్. రాజు.. మహేష్ బాబును హీరోగా అనుకున్నారని సమాచారం. అయితే కథ చాలా సాఫ్ట్‌గా ఉందనే భావనతో ఆయన ఆసక్తి చూపలేదట. అనంతరం అక్కినేని సుమంత్‌ను సంప్రదించినప్పటికీ, ఆయన కూడా ముందుకు రాలేదని చెబుతున్నారు. చివరకు కథ వినగానే ఉదయ్ కిరణ్ వెంటనే అంగీకరించడంతో సినిమా పట్టాలెక్కింది. ఆ నిర్ణయం ఆయన కెరీర్‌కు కీలక మలుపు తిప్పింది.
మేనల్లుడు తేజ రియాక్షన్..
రీ-రిలీజ్ నేపథ్యంలో ఉదయ్ కిరణ్ కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మేనల్లుడు తేజ సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రేక్షకుల ప్రేమ తగ్గలేదని అన్నారు. ఫిబ్రవరి 14న కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని అభిమానులను కోరారు. చిన్నప్పటి జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు వస్తున్నాయని ఆయన భావోద్వేగంగా చెప్పారు.
మేనకోడలు మహతి..
అలాగే ఉదయ్ కిరణ్ మేనకోడలు మహతి కూడా ఒక వీడియో ద్వారా స్పందించింది. సినిమా విడుదలైనప్పుడు తాను చిన్న శిశువునని, ఇప్పుడు అదే సినిమాను పెద్ద తెరపై చూడటం ఆనందంగా ఉందని తెలిపింది. ఈ వీడియో చూసిన అభిమానులు మహతి తన మామ ఉదయ్ కిరణ్‌ను పోలి ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఒకప్పుడు ప్రేమకథలకి ట్రెండ్ సెట్ చేసిన 'మనసంతా నువ్వే' మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాత జ్ఞాపకాలను మళ్లీ తెరపై ఆస్వాదించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.
25 ఏళ్ళ సంద్రంగా గా ఎవర్గ్రీన్ బ్లాక్‌బస్టర్ ‘ మనసంతా నువ్వే ‘ ఫిబ్రవరి 14 న రీ రిలీజ్ అవుతుంది 🥁🥁🔥🔥🔥
— Andhra Talkies (@AndhraTalkie) February 11, 2026
- ఉదయ్ కిరణ్ మేనకోడలు మహతి #ManasanthaNuvve #Udaykiran
pic.twitter.com/RA3oLinsIU
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications