మోహన్ బాబును దూరం పెడుతున్న మంచు మనోజ్?

కరోనా వచ్చిన తర్వాత మంచు మనోజ్ సినిమాలకు దూరమయ్యారు. తర్వాత భూమా నాగిరెడ్డి-శోభానాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికరెడ్డిని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరిద్దరికీ ఇది ద్వితీయ వివాహమే. కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం భూమా మౌనికతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

భర్తగా తన బాధ్యతను నిర్వర్తిస్తానని.. తన భార్యకు మాత్రమే తోడుగా ఉంటానని చెప్పడంతో కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. అసలు విషయంలోకి వెళ్తే.. గత కొన్ని రోజులుగా రాజకీయాల్లోకి వస్తానని మంచు మనోజ్ అంటున్నారు. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. తన తండ్రి మోహన్ బాబు విధేయులుగా ఉన్న వైసిపి పార్టీకి మద్దతు పలుకుతారా? లేక తన భార్య మౌనిక రెడ్డి కుటుంబం విధేయులుగా ఉన్న తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతారా ? అన్న సందేహం ప్రస్తుతం వైరల్ గా మారింది.

Manchu Manoj keeping away his father Mohan Babu

మౌనిక కోసం టీడీపీ లోకి వెళ్ళబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదుకానీ తన భార్యకు మాత్రమే తోడుగా ఉంటానని చెప్పడంతో.. ఇక ఈయన తన తండ్రిని కూడా భార్య కోసం దూరం చేసుకోబోతున్నారు అని అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త సంచలనంగా మారింది. భార్యకు మద్దతుగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడంలాంటివి చేయాలని ఆయన భవిష్యత్తు ప్రణాళికలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేయబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీకి దగ్గరవడంద్వారా తన తండ్రి మోహన్ బాబును, అన్న మంచు విష్ణును దూరం పెడుతున్నారంటున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+