అతన్ని నమ్మినందుకే ఇలా జరిగింది.. మనోజ్‌తో వివాదంపై మంచు విష్ణు ఓపెన్ !

తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు ఫ్యామిలీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ గత కొంతకాలంగా వారి మధ్య విభేదాలు కారణంగా కుటుంబ పంచాయతీ రోడ్డుకెక్కింది. అన్నదమ్ములు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య ఇష్యూ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. గొడవలు, కేసులతో మొదలైన ఈ తతంగం ఇప్పుడు డైరెక్ట్ గానే కామెంట్స్ చేసుకునే స్థాయికి చేరింది.

రీసెంట్ గా రక్తం పంచుకొని పుట్టినవాళ్లే తన పతనాన్ని కోరుకుంటున్నారని విష్ణు ఘాటుగా వ్యాఖ్యానించారు. అందుకు బదులుగా మంచు మనోజ్ భైరవం ఈవెంట్ లో మాట్లాడుతూ.. కట్టు బట్టలతో రోడ్డు మీదకు వచ్చానన్నారు. కట్టె కాలేవరకు తాను మోహన్ బాబు కొడుకునేనని అన్నారు. అంతే కాకుండా శివయ్య అంటే శివయ్య రాడని, ఇలాంటి అభిమానులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల రూపంలోనే శివయ్య వస్తాడని సెటైర్లు వేశారు. ఆ తర్వాత అలా అన్నందుకు క్షమాపణలు కూడా చెప్పారు.

manchu-vishnu-shocking-comments-on-family-issues-at-interview

అయితే ఇప్పుడు మరోసారి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నిర్వహించిన ఈ ఇంటర్వ్యూలో మంచు విష్ణు హాట్ కామెంట్స్ చేశారు. కన్నప్ప సినిమా గురించి, కుటుంబం లోని వివాదాల గురించి విష్ణు నోరు విప్పారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

విష్ణు ఏమన్నారంటే.. కొత్త ప్రతిభను ప్రోత్సహించడం తనకిష్టమని.. అందుకే వీఎఫ్ఎక్స్ కోసం సరైన నైపుణ్యం లేని వ్యక్తిని తీసుకోవడమే తాను చేసిన పెద్ద తప్పని చెప్పుకొచ్చారు. వీఎఫ్ఎక్స్ పనుల వల్లే సినిమా కొంత ఆలస్యమైందని.. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేసేందుకు తమ టీం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. అలానే తనికెళ్ల భరణి చెప్పిన 'కన్నప్ప' కథాంశం నచ్చడంతో.. ఆ ఐడియాని విదేశీ నిపుణులతో కలిసి అభివృద్ధి చేశానని తెలిపారు. సినిమాకు మొదట రూ.100 కోట్ల లోపే బడ్జెట్ అవుతుందని అంచనా వేశామని.. కానీ ఖర్చు రెట్టింపు అయిందని విష్ణు వివరించారు.

ఇక తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. మంచు కుటుంబంలో గొడవలు బాధాకరం అని వాపోయారు. వాటిని చర్చింకోవాలని అవసరం ఉందని.. అందుకు తాను పెద్దరికం తీసుకుంటానని వెల్లడించారు. అందుకు విష్ణు సానుకూలంగా స్పందించి.. సూచనలు తప్పకుండా పాటిస్తానని చెప్పారు.

కన్నప్ప సినిమా జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ మూవీలో రుద్ర అనే పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్.. బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి సహా పలువురు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మంచు మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+