నేను మైక్రో ఫైనాన్స్ బాధితురాలినే - సింగర్ మంగ్లీ
తెలుగు చిత్ర పరిశ్రమలో ఫోక్ సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సింగర్ " మంగ్లీ ". కేవలం సినిమాలతోనే కాకుండా ప్రైవేట్ అల్భమ్ సాంగ్స్ ద్వారా కూడా మంచి గుర్తింపు పొందింది. తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ఇప్పయికే ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన ఈమె ప్రస్తుతం వివాదాలతో హాట్ టాపిక్ గా మారింది. లేటెస్ట్ గానే వెలుగులోకి వచ్చిన మైక్రో ఫైనాన్స్ వివాదంపై స్పందిస్తూ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టంగా తెలిపారు.
ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. మైక్రో ఫైనాన్స్ అనే పదమే తనకు పూర్తిగా తెలియదని మంగ్లీ తెలిపారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. రామావత్ మధును కమ్యూనిటీ ప్రోగ్రామ్‌లో కలిసిన మాట నిజమేనని స్పష్టం చేశారు. కానీ అంత మాత్రాన ఆయన చేసిన తప్పులకు నేను బాధ్యురాలిని కాదని అన్నారు. తన కుటుంబాన్ని కూడా ఈ వివాదంలోకి లాగడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

అలానే తన తమ్ముడు శివకు ఈ వివాదంతో ఎలాంటి సంబంధం లేదని.. కుటుంబ సభ్యులను ఇందులోకి లాగడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఈ విషయం వల్ల మేమంతా మానసికంగా చాలా క్షోభకు గురవుతున్నాం" అని ఆమె చెప్పారు. చీటింగ్ కేసులో తన పేరు వాడుతున్నాడని తెలిసిన వెంటనే తానే ముందుగా చర్యలు తీసుకున్నానని మంగ్లీ వెల్లడించారు. "నా పేరు వాడుతూ మోసం చేస్తున్నాడని తెలిసి నేనే స్వయంగా మధుపై ఫిర్యాదు చేశాను. ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో నేను కూడా ఒక బాధితురాలినే" అని ఆమె పేర్కొన్నారు.
అలానే బాధితులకు న్యాయం జరగాలని ఆమె డిమాండ్ చేశారు. "డబ్బులు ఇచ్చి మోసపోయిన వారికి న్యాయం జరగాలి. నాపై అకారణంగా ఆరోపణలు చేస్తూ నా పేరును చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రామావత్ మధుతో నాకు ఎలాంటి బంధుత్వం లేదు" అని మంగ్లీ స్పష్టం చేశారు. అంతే కాకుండా చట్టంపై పూర్తి నమ్మకం ఉందని, దర్యాప్తుకు సహకరిస్తానని ఆమె తెలిపారు. "చట్టం ఎవరికి మినహాయింపు ఇవ్వదు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. నేను దర్యాప్తు అధికారులకు పూర్తిగా సహకరిస్తాను" అని మంగ్లీ అన్నారు.
ఈ వివాదం కారణంగా కొంతకాలం ఆమెపై నెగటివ్ ప్రచారం జరిగినప్పటికీ, ఆమె కెరీర్‌పై పెద్దగా ప్రభావం పడలేదు. తన ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, యూట్యూబ్ మరియు స్టేజ్ ప్రోగ్రామ్‌లలో తన పాటలతో మళ్లీ దూసుకుపోతున్నారు. వివాదాలను పక్కన పెట్టి సంగీత ప్రయాణంపై దృష్టి పెట్టిన మంగ్లీ, అభిమానుల మద్దతుతో తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications