ఇంటి సమస్యను బజారుకి ఈడుస్తున్నారు.. డాన్సర్స్ ఎన్నికలు జరాగాల్సిందే: సత్య మాస్టర్ కామెంట్స్

డాన్సర్స్ అసోసియేషన్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ మేరకు డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలతపై సత్య మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసోసియేషన్ లో నాలుగు ఎలుకలు ఉన్నాయని.. వాళ్ల అవినీతి త్వరలోనే బయటపడుతుందని సత్య మాస్టర్ అన్నారు. సుమలత విభజించి పాలిస్తున్నారని మండిపడ్డారు. జనరల్ బాడీలో మాట్లాడుతున్నవారి మైకులు లాక్కున్నారని తెలిపారు. డాన్సర్స్ ఎన్నికలు జరాగాల్సిందేనని స్పష్టం చేశారు. అక్టోబర్ 11న ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీనియర్ డాన్సర్‌లు, మాస్టర్‌లు మీడియా సమావేశం నిర్వహించారు. అసోసియేషన్‌ లో సుమారు 600 మంది డాన్సర్లు ఉండగా, కొందరి వ్యవహారాల కారణంగా మొత్తం సంఘానికి సమస్యలు వస్తున్నాయని సత్య మాస్టర్ కీలక ఆరోపణలు చేశారు.

" ఒక యూనియన్ కు సంబంధించిన ఇంటి సమస్య బజారున పడింది. ఒక అసోసియేషన్ లో 600 మంది డాన్సర్స్ ఉన్నారు. అందులో నాలుగు అవినీతి ఎలుకలు ఉన్నాయి. ఈ నాలుగు ఎలుకల గురించి ఇల్లు తగల పెడదాము అంటే ఎలా..? ప్రెసిడెంట్ గా ఉన్న సుమలత సరైన నిర్ణయాలు తీసుకోవాలి. బలిసిన ఒక ఎలుక ను వాళ్లే సపోర్ట్ చేస్తున్నారు. డాన్సర్స్ అసోసియేషన్ లో చాలా సమస్యలు ఉన్నాయి. అసోసియేషన్ ను లేకుండా చేద్దామని చూస్తున్నారు. అందుకే మేము వచ్చి మాట్లాడుతున్నాం. ఫెడరేషన్ మాకు తల్లి లాంటిది. ఫెడరేషన్ అనుకూలంగా ఉంటె మీకు ఒకలాగా లేకపోతే ఇంకొక లాగా సుమలత విభజించి పాలిస్తున్నారు కాబట్టే ఈ సమస్యలు వచ్చాయి" అని సత్య మాస్టర్ ఫైర్ అయ్యారు.

"మొన్న జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో సుమలత మనుషులు వచ్చి మాట్లాడుతున్న వారి మైకు లాక్కున్నారు. ప్రెసిడెంట్ హోదాలో వాళ్లని కంట్రోల్ చెయ్యాల్సింది పోయి మీరే సమర్ధిస్తే ఎలా..? సుమలత ఎన్నికల్లో ఏమీ హామీలు ఇచ్చారో అవి చేయండి. చాలా మంది డాన్సర్స్ భయపడుతున్నారు మాట్లాడడానికి..అందుకే సీనియర్స్ అయిన మేము మాట్లాడుతున్నాం. యూనియన్ కు ప్రాబ్లం వస్తే మేము కచ్చితంగా మాట్లాడతాం. రిటైర్ అయినా వాళ్లను వెంటేసుకోని మా సభ్యులతో కావాలని గొడవ పడుతున్నారు. సుమలత గారు మొన్న బాడీ మీటింగ్ లో ఆమె మినిట్స్ బుక్ లాక్కొనే ప్రయత్నం చేశారు. గొడవ జరుగుతుంది అని మేము వెళ్లాం. ఆమె మా పేర్లు పెట్టి కేసులు వేశారు. సభ్యుల నిర్ణయం మేరకు అక్టోబర్ 11 న ఎలక్షన్స్ కు వెళుతున్నాం.. డాన్సర్స్ కు న్యాయంకోసం ఎలక్షన్స్ జరగాలి" అని సత్య మాస్టర్ స్పష్టం చేశారు.

MasterSatya makes sensational comments about Dancers Association President Sumalatha latest news

ఇక రాజన్న మాస్టర్ మాట్లాడుతూ.. "సుమలత మా మీద లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారు. జనరల్ బాడీ మీటింగ్ లో మెజారిటీ డాన్సర్స్ అక్టోబర్ 11 న ఎలక్షన్స్ కి మద్దతు తెలిపారు. ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ మీద ఆమె ఆరోపణలు చేస్తున్నారు. ఆమె ఆరోపణలు ఖండిస్తున్నాం" అని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+