నీతో సినిమా చేస్తే ఆస్తులు అమ్ముకోవాలి..!

మెగా డాటర్ నిహారిక ఇటీవల ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ కావడానికి నిహారిక ప్రయత్నిస్తోంది. నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిన విషయమే. చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. అయితే భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించ లేకపోయింది. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లైన సంవత్సరానికే భర్తకు విడాకులిచ్చి షాకిచ్చింది.

విడాకులు అనంతరం నిహారిక తిరిగి సినిమాల్లో నటిస్తోంది. మంచు మనోజ్‌ పక్కన హీరోయిన్‌గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళంలో 'మద్రాస్‌కారన్' మూవీలో హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి కానుకుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. తెలుగులో మనోజ్ నటిస్తోన్న ''వాట్ ది ఫిష్'' అనే సినిమాలో నిహారిక హీరోయిన్‌గా ఎంపికైంది.

Mega Daughter Niharika in Full Swing After Divorce Gives a Shocking Reply to Sudigali Sudheer

ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఆమె తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన ''కమిటీ కుర్రాళ్లు'' సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక నిహారిక నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే.యదు వంశీ దర్శకత్వంలో ''కమిటీ కుర్రాళ్లు'' అనే సినిమాను నిర్మించింది. తాను నిర్మించిన తొలి సినిమా హిట్ కావడంతో నిహారిక సైతం ఆనందం వ్యక్తం చేశారు. తొలి సినిమాతోనే సక్సెస్ కొట్టిన నిహారిక ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం తన రెండో సినిమాను తెరకెక్కించే పనిలో పడింది నిహారిక.

తాజాగా నిహారిక ఓ టీవీ షోకు గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ షోకు యాంకర్‌గా సుడిగాలి సుధీర్ వ్యవహరించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది.నిహారికను సుడిగాలి సుధీర్ సినిమా ఆఫర్ అడిగారు. మీరు కమిటీ కుర్రాళ్లు అనే సూపర్ హిట్ చిత్రం తీశారు.. నాతో కూడా అలా..ఏదైనా కమిటీ అనే సినిమాను తీయవచ్చు కదా అంటూ మెగా డాటర్‌ను సుడిగాలి సుధీర్ కోరారు.

దీనికి వెంటనే నిహారిక రియాక్ట్ అవుతూ.. నీతో కమిటీలు లాంటి సినిమాలు తీస్తే నాకు టీ డబ్బులు కూడా రావని సరదాగా జోక్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+