హ్యాట్రిక్ ఫ్లాప్స్..ఆ మెగా హీరో కెరీర్ క్లోజ్...?

సినీ ఇండస్ట్రీలో హిట్ ఉంటేనే ఎవరికైనా గుర్తింపు ఉంటుంది. అది స్టార్ హీరోనైనా, యంగ్ హీరోనైనా. ఒక్కసారి ప్లాప్ ముద్ర పడిందంటే చాలు, అటువైపు ఎవరు కూడా కన్నెత్తి చూడరు. ప్రస్తుతం ఓ మెగా హీరో కెరీర్ పరిస్థితి అలానే ఉంది. తాను నటించిన తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఆ మెగా హీరో, ఇప్పుడు సినిమాలు లేక ఖాళీగా ఉంటున్నారు.ఆ హీరో మరెవ్వరో కాదు వైష్ణవ్ తేజ్.

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా, సాయి ధరమ్ తేజ్ తమ్ముడుగా వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. డెబ్యూ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 'ఉప్పెన' 100 కోట్లు సాధించి సంచలనం సృష్టించింది. దీంతో మొదటి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. అయితే ఆ తర్వాత అతను నటించిన సినిమాలు ఏమీ కూడా హిట్ కాదు కదా, యావరేజ్‌గా కూడా నిలవలేదు.

Mega hero Vaishnav Tej is not doing movies

'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత 'కొండపొలం' అనే అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీలో నటించారు వైష్ణవ్ తేజ్. ఈ సినిమాకు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఆ తర్వాత 'రంగ రంగ వైభవంగా' అనే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా కూడా తీవ్ర నిరాశ పరిచింది.

రెండు వరుస ఫ్లాపులు రావడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో 'ఆదికేశవ' అనే సినిమాతో మాస్ హీరో అనిపించుకునే ప్రయత్నం చేశారు వైష్ణవ్ తేజ్.ఈ సినిమా వైష్ణవ్ తేజ్ కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇలా హ్యాట్రిక్ ఫ్లాప్స్‌తో ఢీలా పడ్డ ఈ మెగా హీరో, ఇంతవరకూ తన త‌దుప‌రి సినిమాని ప్రకటించలేదు. బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలనే ఆలోచనతోనే వైష్ణవ్ తేజ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే 'ఆదికేశవ' సినిమా వచ్చి ఎనిమిది నెలలు అయినప్పటికి , ఇప్పటి వరకు సినిమా ఎనౌన్స్ చేయకపోవడంతో ఈ మెగా హీరో కెరీర్ క్లోజ్ అయినట్టే అనే ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+