మెగా ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్.. "క్లింకార" ఫేస్ రివీల్..!
మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతుల ముద్దుల కుమార్తె క్లీంకార కొణిదెలను చూడాలని మెగా అభిమానులు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా కుటుంబంలో కొత్త తరం వారసురాలిగా జన్మించిన క్లీంకార ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ.. ఆమె ముఖాన్ని మాత్రం ఇప్పటివరకు పూర్తిగా రివీల్ చేయలేదు. తమ కుమార్తె ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ చరణ్-ఉపాసన దంపతులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించారు.
అయితే ఇప్పుడు క్లీంకార పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు రామ్ చరణ్, ఉపాసన. తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఫ్యామిలీ ఫోటోను షేర్ చేస్తూ మొదటిసారిగా మెగా ప్రిన్సెస్ ముఖాన్ని అభిమానులకు చూపించారు. ఆ ఫోటోలో తల్లిదండ్రుల మధ్య కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న క్లీంకార అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోకు కొద్ది గంటల్లోనే లక్షలాది లైక్స్, వేలాది కామెంట్లు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.

కాగా క్లీంకార ఫోటో బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా సందడి నెలకొంది. మెగా అభిమానులు ఆ ఫోటోలను భారీగా షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. "మెగా ప్రిన్సెస్ ఎంత క్యూట్‌గా ఉంది", "అచ్చం అమ్మ ఉపాసన పోలికలే ఉన్నాయి", "చిరునవ్వు చూస్తే మనసు దోచేస్తోంది" అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు అభిమానులు "లిటిల్ మెగా క్వీన్", "చరణ్ కూతురు ఎంతో ముద్దుగా ఉంది" అంటూ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు, మెగా ఫ్యామిలీ సభ్యులు కూడా క్లీంకారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
చరణ్ గతంలో ఏమన్నారంటే..
గతంలో బాలకృష్ణ హోస్ట్ చేసిన 'అన్‌స్టాపబుల్' టాక్ షోలో పాల్గొన్న రామ్ చరణ్.. క్లీంకార గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తెపై చిన్న వయసులోనే అనవసరమైన పబ్లిక్ ప్రెజర్ పడకూడదని భావిస్తున్నానని చెప్పారు. "తను ఎప్పుడైతే నన్ను సొంతంగా 'నాన్నా' అని పిలుస్తుందో, అప్పుడే ప్రపంచానికి అధికారికంగా చూపిస్తాను" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కూడా పలుమార్లు తిరుమల శ్రీవారి దర్శనానికి, కుటుంబ వేడుకలకు క్లీంకారను తీసుకొచ్చినప్పటికీ.. ఆమె ముఖం స్పష్టంగా కనిపించకుండా ఉపాసన ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ ఇటీవల దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన 'పెద్ది' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో చరణ్ నటనకు ప్రశంసలు లభించాయి. జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. విడుదలైన తర్వాత ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.












Click it and Unblock the Notifications