ఎవరిని ఉద్దేశించి చిరంజీవి ఆ కామెంట్స్ చేశారు??

మెగాస్టార్ చిరంజీవి ఈరోజున ఈ స్థాయిలో ఉన్నారంటే అందుకు కారణం ఆయన కృషి, పట్టుదలతోపాటు పాటించిన వ్యక్తిగత శ్రమశిక్షణ కూడా ప్రధాన కారణం. ఏరోజు ఎవరి గురించి కనీసం చిన్న మాట కూడా చెడుగా మాట్లాడలేదు. అంతేకాదు.. తన సినీ కెరీర్ లో ఎవరినీ విమర్శించలేదు. మౌనంగా, ఓ రుషిలా తన పని తాను చేసుకుంటూ వెళతారు. తన గురించి ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా పట్టించుకోరు.

దక్షిణ భారతంలో సంచలనం : అయితే తాజాగా చిరంజీవి చేసిన ఒక వ్యాఖ్య తెలుగు సినీ పరిశ్రమతోపాటు దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది. చిరంజీవి ఏమిటి.. ఇలా మాట్లాడారు.. ఆయనేనా మాట్లాడింది అంటూ పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తన హీరోయిజాన్ని రీ రికార్డింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ఎలివేట్ చేయడం కాదని, తననుంచి ప్రేక్షకులు డ్యాన్స్, ఫైట్స్, నటన ఆశిస్తారని చెప్పారు.

mega star chiranjeevi comments on cinema back ground music

జైలరా? అఖండా : ఈ వ్యాఖ్యలు చిరంజీవి ఎవరిని ఉద్దేశించి చేశారంటూ పరిశ్రమలో చర్చ నడుస్తోంది. కొన్నాళ్ల నుంచి వెండితెర మీద హీరోయిజాన్ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేస్తోంది. ఇటీవలే విడుదలైన జైలర్ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సంచలనం సృష్టించింది. ఒక వేడకలో రజనీకాంత్ మాట్లాడుతూ యావరేజ్ సినిమాను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అనిరుధ్ రవిచందర్ బ్లాక్ బస్టర్ సినిమా మరల్చారని కొనియాడారు. దీనికి సినిమా యూనిట్ మొత్తం అంగీకరించింది.

దర్శకులు మాయ చేస్తున్నారా : అలాగే బాలకృష్ణ సినిమా అఖండలో కూడా తమన్ సూపర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఆ సినిమా విజయంలో అది ప్రధాన పాత్ర పోషించింది. గత కొన్నేళ్లుగా డైరెక్టర్లు తెరపై కథను వదిలేసి హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సన్నివేశాలు, మ్యూజిక్ తోనే మాయ చేస్తున్నారనేది చిరంజీవి ఉద్దేశం కావచ్చని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+