చిరంజీవి-బాలకృష్ణ కాంబినేషన్ లో మిస్సయిన చిత్రం

మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ.. ఇద్దరూ కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో మల్టీస్టారర్ చిత్రం తీయాలని చాలామంది దర్శకులు ప్రయత్నించారుకానీ అనుకోని కారణాలవల్ల కుదరలేదు. కొన్ని కొన్ని సందర్భాల్లో విడుదలైన చిత్రాలను పరిశీలిస్తే ఫలానా హీరోలు చేస్తే బాగుండేది అని ప్రేక్షకులు అనుకుంటారు. రచయిత, దర్శకులు మాత్రం సినిమా తీయడానికి ముందే ఆ కథలో ఎవరైతా బాగుంటారో ముందే పరిశీలించుకొని ఆయా హీరోలవద్దకు వెళతారుకానీ కథలు నచ్చక, కాల్షీట్లు ఖాళీలేక అవి పట్టాలెక్కవు.

చిరంజీవి శివుడిగా నటించిన చిత్రం శ్రీ మంజునాథ. ఇందులో అర్జున్ కథానాయకుడిగా నటించారు. ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఈ సినిమాలో శివుడి పాత్రలో బాలకృష్ణ అయితే బాగుంటుందని భావించారు. కమర్షియల్ చిత్రాల్లో వీరిద్దరూ నటించడం కుదరడంలేదు కాబట్టి పౌరాణిక సినిమాలోనైనా నటింపచేయాలనుకున్నారు. అయితే కథలో అర్జున్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదని బాలకృష్ణ భావించి ఈ పాత్ర చేయడానికి ముందుకు రాలేదు. దీంతో అర్జున్-సౌందర్య హీరో హీరోయిన్లుగా, శివుడి పాత్రలో చిరంజీవి నటించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.

megastar chiranjeevi and nandamuri balakrishna combination missted movie

బాలయ్య అర్జున్ పాత్ర చేసివుంటే సినిమాకు కూడా కలెక్షన్లు భారీగా వచ్చేవని విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. బి.గోపాల్, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి లాంటి దర్శకులు చిరంజీవి, బాలకృష్ణతో మల్టీస్టారర్ తీయాలని ప్రయత్నించారుకానీ అవేవీ పట్టాలెక్కలేదు. కథల స్థాయిలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే వరుసగా హిట్లు సాధించుకుంటూ బాలకృష్ణ దూసుకుపోతున్నారు. చిరంజీవి విశ్వంభర చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషనలో దాదాపుగా మల్టీస్టారర్ అనేది రాకపోవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+