ఓటీటీలోకి చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..!

మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'మన శంకర వర ప్రసాద్ గారు' మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ వసూళ్ల సునమీ సృష్టించింది. రూ. 400 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి ఆల్ టైమ్ రీజినల్ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ప్రముఖ ఓటీటీ మాధ్యమం జీ5లో ఫిబ్రవ‌రి 11 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ మాధ్యమం జీ5లో ఫిబ్రవ‌రి 11 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో రిలీజైన సరిగ్గా నెల రోజులకు డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ మేరకు వచ్చే బుధవారం ఫిబ్రవరి 11 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. అయితే ఈ మూవీ ఏడు భాషల్లో రిలీజ్ కానుండటం విశేషం. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ రానుంది. ఈ విషయాన్ని జీ5 సంస్థ కన్ఫమ్ చేసింది.

ఇక ఈ ఏడాది సంక్రాంతికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్ చిత్రంతో పాటు పలు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే వాటిల్లో చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ అన్నింటి కంటే మెగా బ్లాక్‌ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.400 కోట్ల వరకూ గ్రాస్ వసూళ్లు సాధించింది. భారత్ లోనే ఈ సినిమాకు రూ.200 కోట్లకుపైగా నెట్ వసూళ్లు రావడం విశేషం అని చెప్పొచ్చు.

megastar Chiranjeevi Mana Shankara Vara Prasad Garu Hits Zee5 on February 11 Don t Miss the Fun

ఇక ఈ మూవీలో చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ న‌య‌న‌తార హీరోయిన్ గా నటించింది. అలాగే వెంక‌టేశ్ ద‌గ్గుబాటి, క్యాథ‌రిన్ ట్రెసా త‌దిత‌రులు ఇత‌ర పాత్రల్లో అల‌రించారు. బ‌ల‌మైన ఎమోష‌న్స్‌, ఫ్యామిలీ డ్రామాతో పాటు మంచి యాక్షన్‌ ను క‌ల‌గ‌లిపి సీట్ ఎడ్జ్ డ్రామాతోపాటు ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా రూపొందించారు. ఈ సినిమాతో దర్శకుడు అనిల్ రావిపూడి వరుసగా హిట్స్ అందుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+