పవన్ సంచలన నిర్ణయం- వారి పదవుల రద్దు..!?
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీలు స్థానిక ఎన్నికల వేళ కొత్త నిర్ణయాలతో సిద్దం అవుతున్నాయి. కూటమి .. వైసీపీ రాజకీయం లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఇదే సమయంలో జనసేనాని పవన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ బలోపేతం దిశగా వరుసగా కమిటీల నియామకం పైన స్వయంగా కసరత్తు చేస్తున్నారు. కాగా, తాజాగా పవన్ పార్టీలో ముఖ్య విభాగంలోని వారిని తప్పిస్తూ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ఆసక్తిగా మారుతోంది.
డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ పార్టీ బలోపేతం పైన ఫోకస్ చేసారు. ప్రకాశం, నెల్లూరు జిల్లా కమిటీలను రద్దు చేసిన పవన్.. పూర్తి స్థాయి ప్రక్షాళన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కమిటీల ఏర్పాటు కోసం కేడర్ కే బాధ్యతలు అప్పగించారు. ఇందు కోసం ఇప్పటికే పార్లమెంటరీ వారీగా కమిటీలను ప్రకటించారు. ఈ కసరత్తను పవన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇదే సమయంలో పవన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో పార్టీ వాయిస్ వినిపిస్తున్న 26 మంది అధికార ప్రతినిధుల ను వారి బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి ప్రస్తుతం 14 మంది అధికార ప్రతినిధులు బాధ్యతల్లో ఉన్నారు.

కాగా, పార్టీ తాజా ఆదేశాల్లో కీలక అంశాలను స్పష్టం చేసారు. పా నూతన కమిటీలు ప్రకటించే వరకు ఎవరు టీవీ డిబేట్లో పాల్గొనకూడదని ఆదేశించినట్లు సమాచారం. అదే విధంగా నూతన కమిటీలు ప్రకటించే వరకు ఎటువంటి ప్రకటనలు, మీడియా చర్చల్లో పాల్గొనరాదని సూచన చేసారు. త్వరలోనే అధికార ప్రతినిధుల కొత్త జాబితాను పార్టీ అధిష్టానం ఖరారు చేసి ప్రకటిస్తుంది అని వెల్లడించారు. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా కీలక నిర్ణయాలు పవన్ తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. స్థానిక ఎన్నికల నాటికి పార్టీ కమిటీల నియామకం పూర్తి చేయటంతో పాటుగా.. కొత్త వారితో.. వ్యూహాత్మక ప్రణాళిక లతో బరిలోకి దిగాలని పవన్ భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications