చిరంజీవి వద్దన్న కథతో బాలయ్య ఇండస్ట్రీ హిట్

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకులుగా చిరంజీవి, బాలకృష్ణ కొనసాగుతున్నారు. తర్వాత తరం హీరోలు వచ్చినప్పటికీ వీరిద్దరు మాత్రం పోటాపోటీగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ప్రస్తుతం కుర్ర హీరోలు ఎంతోమంది ఉన్నప్పటికీ వీరిద్దరి సినిమాలు వస్తున్నాయంటే అభిమానుల్లో ఉండే క్రేజే వేరుగా ఉంటుంది. సాధారణంగా దర్శకులు కథను రాసుకున్నప్పుడు వారి దృష్టిలో ఒక హీరో ఉంటాడు. ఆ హీరో బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకొని కథను సిద్ధం చేసుకుంటారు.

ఆ కథను హీరోకు వినిపిస్తే కాల్షీట్లు ఖాళీలేకపోవడం, కథ నచ్చకపోవడం, కొన్ని మార్పులు, చేర్పులు చెబితే దర్శకుడికి ఇష్టం లేకపోవడం.. లాంటి కారణాలు ఎన్నో ఉంటాయి. అలాగే కోడి రామకృష్ణ మంగమ్మగారి మనవడు సినిమా కథను ముందుగా చిరంజీవి దగ్గరకు తీసుకువెళ్లారు. అయితే ఆ కథ నచ్చక చిరంజీవి వద్దన్నారు. దీంతో కోడి రామకృష్ణ బాలయ్యకు కథ వినిపించారు.

megastar chiranjeevi rejected mangammagari manavadu movie

తనకు కథ బాగా నచ్చింది. హీరోయిన్ గా సుహాసినిని ఎంపిక చేశారు. భార్గవ్ ఆర్ట్స్ పతాకంపై దీన్ని నిర్మించారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. బాలకృష్ణకు తిరుగులేని ఇమేజ్ ను కట్టబెట్టింది. తెలుగు సినీ చరిత్రలో తనకు కూడా ఒక పేజీని మంగమ్మగారి మనవడు సినిమా దక్కించుకుంది.

తర్వాత ఈ సినిమా చేయలేకపోయినందుకు చిరంజీవి ఇప్పటికీ బాధపడుతుంటారు. తన సన్నిహితుల దగ్గర కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. అంత మించి సినిమాను వదులుకున్నానే అని బాధపడుతుంటారట. ఏదేమైనప్పటికీ కొందరు హీరోలు వద్దన్నవి మరికొందరు హీరోలకు వరంగా మారతాయి. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా చేస్తుండగా, బాలయ్య బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+