మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కెరీర్‌లో మరో గోల్డెన్ ఫేజ్‌ను ఆస్వాదిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు సినిమా బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకొని.. గ్రాండ్ హిట్ కొట్టింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను సమానంగా ఆకట్టుకుని, చిరంజీవి కెరీర్‌లోనే తొలిసారి రూ.300 కోట్ల క్లబ్‌లో చోటు దక్కించుకుంది. "వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్" అంటూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే పొలిటికల్ ఎంట్రీకి ముందు టాలీవుడ్ నెంబర్ 1 హీరోగా కొనసాగారు చిరు.
తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ ఆయనకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఫిల్మ్ కెరీర్ లో ఎన్నో రికార్డులను సైతం సొంతం చేసుకున్నారు. కాగా ఈ క్రమంలోనే ఒకానొక దశలో ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా కూడా నిలిచారు. ఇంతకీ ఏ సినిమాకి మెగాస్టార్ అంత రెమ్యూనరేషన్ అందుకున్నారు. ఆ స్టోరీ ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

ఏ మూవీ అంటే..
మెగాస్టార్ నటించిన "ఘరానా మొగుడు" తెలుగు సినిమా చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది. 1992 ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం అప్పటి ఆంధ్రప్రదేశ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి.. మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. ప్రముఖ నిర్మాత Devi Vara Prasad నిర్మాణంలో.. దర్శకేంద్రుడు K. Raghavendra Rao దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఊహించని స్థాయిలో ఆకట్టుకుంది. పూర్తి మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో చిరంజీవి.. స్టైల్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. మహిళా ప్రాధాన్యత ఉన్న కథలో, ఒక సాధారణ కార్మికుడు తన ప్రతిభతో ఎదిగి పెద్ద పారిశ్రామికవేత్తను సవాలు చేయడం వంటి అంశాలు అప్పటి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చాయి.
ఈ చిత్రంలో Nagma, Vani Viswanath కథానాయికలుగా నటించగా.. Rao Gopal Rao, Kaikala Satyanarayana, Brahmanandam వంటి దిగ్గజాలు కీలక పాత్రల్లో మెప్పించారు. సంగీత దర్శకుడు M. M. Keeravani అందించిన పాటలు ఈ సినిమాకు ప్రాణం పోశాయి. 'బంగారు కోడిపెట్ట', 'కిటుకులు తెలిసినా', 'హే పిల్లా హల్లో పిల్లా' వంటి పాటలు అప్పట్లోనే కాదు.. ఇప్పటికీ ప్రజాదరణ పొందుతున్నాయి. సాహిత్యకారుడు Bhuvana Chandra రాసిన పదాలు, చిరంజీవి డ్యాన్స్ కలిసిపోవడంతో పాటలు ట్రెండ్ సెట్టర్‌లుగా నిలిచాయి.
బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం..
విడుదలైన తొలి రోజు నుంచే ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. 39 కేంద్రాల్లో 100 రోజులు, 3 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శింపబడి రికార్డులు సృష్టించింది. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో 183 రోజులు ఆడటం ఆ కాలంలో అరుదైన ఘనత. మొదటి వారంలోనే ₹1.35 కోట్ల షేర్, మొత్తం రన్‌లో ₹10 కోట్ల షేర్ సాధించడం అప్పుడు అద్భుతం. సుమారు ₹4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, మొత్తం ₹20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దక్షిణాది సినీ పరిశ్రమలో ₹10 కోట్ల మార్క్ దాటిన తొలి చిత్రంగా నిలిచి, ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టించింది.

మరోవైపు ఈ చిత్రాన్ని మలయాళంలో 'హే హీరో' పేరుతో విడుదల చేయగా, అక్కడ కూడా ఘన విజయం సాధించింది. కేరళలో కూడా 175 రోజుల ప్రదర్శనతో మంచి వసూళ్లు రాబట్టింది. ఇది సినిమా పాన్-ఇండియా స్థాయిలో ప్రభావాన్ని చూపించిందని చెప్పాలి. ఈ సినిమాతో Chiranjeevi స్టార్‌డమ్ మరో స్థాయికి చేరుకుంది. ఈ చిత్రానికి గాను ఆయన ₹1.25 కోట్ల పారితోషికం అందుకుని, అప్పట్లో దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ పొందిన నటుడిగా చరిత్ర సృష్టించారు.
అంతే కాకుండా International Film Festival of Indiaలో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం మరో గొప్ప విశేషం. కమర్షియల్ సినిమా అయినప్పటికీ, అంతర్జాతీయ వేదికపై ప్రదర్శింపబడడం ప్రత్యేక గుర్తింపు. 'ఘరానా మొగుడు' తర్వాత తెలుగు సినిమాలో మాస్ సినిమాల ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. హీరో ఎలివేషన్, డ్యాన్స్, పాటల ప్రాధాన్యత పెరిగిందని చెబుతుంటారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మే 1 నుంచి సినిమా థియేటర్లు బంద్? -
టాలీవుడ్లో మరో జంట విడాకులు.. షాక్‌లో ఫ్యాన్స్! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
మహేష్ బాబు " వారణాసి " స్టోరీ ఇదే.. పాన్ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ పక్కా ? -
బెస్ట్ యాక్టర్‌గా మరో అవార్డ్ అందుకున్న అక్కినేని హీరో..! -
చిక్కుల్లో పడ్డ యంగ్ హీరో.. పార్టీలకు రావాలంటూ అమ్మాయిలకు మెసేజ్‌లు? -
కోలీవుడ్ పట్టించుకోకున్నా "దళపతి విజయ్"కి అండగా మెగాస్టార్..! -
ఆ స్టార్ డైరెక్టర్ అందరి ముందు చీర విప్పి పడుకోమన్నాడు !! -
బిగ్ షాక్ : ప్రభాస్ "స్పిరిట్" షూటింగ్ సెట్లో అగ్ని ప్రమాదం.. -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ












Click it and Unblock the Notifications