అల్లు అర్జున్ విషయంలో సీరియస్ అయిన చిరంజీవి?

కొద్దిరోజుల నుంచి చిరంజీవి కుటుంబం వార్తల్లో నిలుస్తోంది. సాధారణంగా ఈ కుటుంబం సినీ పరిశ్రమకు చెందినది కాబట్టి చేస్తున్న సినిమాలు, వాటి షెడ్యూల్స్.. తదితర వివరాలను పంచుకుంటుండటం సహజం. అయితే అందుకు భిన్నంగా ఈ కుటుంబం రాజకీయయంగా వార్తల్లో నిలుస్తోంది. మెగా కుటుంబానికి చెందిన అల్లు అర్జున్ పిఠాపురం నుంచి పోటీచేస్తున్న పవన్ కల్యాణ్ కు మద్దతు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత రోజు నంద్యాల వెళ్లి వైసీపీ తరఫున పోటీచేస్తున్న తన స్నేహితుడు రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు పలికారు.

ఇచ్చిన మాట కోసం వచ్చా..
దీంతో మెగా కుటుంబంలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. రవిచంద్ర తన స్నేహితుడు కాబట్టి వెళ్లానని, తాను రాజకీయంగా ఏ పార్టీకి మద్దతు కాదని, తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా లేదని, రవిచంద్రకు ఇచ్చిన మాట కోసం వచ్చినట్లు అల్లు అర్జున్ తెలిపాడు. తాజాగా చిరంజీవి సోదరుడు నాగబాబు బన్నీని ఉద్దేశిస్తూ పరోక్షంగా ఒక ట్వీట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే...! అని ఆ ట్వీట్ లో ఉంది.

megastar chiranjeevi warning to nagababu for allu arjun issue

నేను చేసిన తప్పే చేస్తున్నావు..
అల్లు అర్జున్ ను ఉద్దేశించే నాగబాబు ఆ ట్వీట్ చేశారని అందరికీ అర్థమైపోయింది. ఈ ట్వీట్ పై మెగా అభిమానులు మండిపడ్డారు. నాగబాబుకు నోటితొందర ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చిరంజీవి సీరియస్ అయి నాగబాబుకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మన కుటుంబాన్ని వేలెత్తే విధంగా మనం సోషల్ మీడియాలో వైరల్ అవకూడదని, మన పరువును మనమే తీసుకోకూడదని, తిట్టుకున్నా, కొట్టుకున్నా మన కుటుంబం మనదేనని, ఒకరికి చులకన కాకూడదన్నారు. అందులోను రాజకీయాల కారణంగా అసలు చులకన అవడం తనకు ఇష్టం లేదని, గతంలో తాను చేసిన తప్పును మళ్లీ ఇప్పుడు నువ్వు చేస్తున్నావని, అటువంటివేమీ చేయవద్దని క్లాస్ పీకినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+