సీఎం రిలీఫ్ ఫండ్‌కు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఆయన ఒక కోటి రూపాయల విరాళం అందించారు. ఇది రాష్ట్ర ప్రజలకు అత్యవసర సహాయం, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్తుల సమయంలో ఉపశమనం కలిగించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. కాగా ఈ విరాళానికి సంబంధించిన చెక్కును చిరంజీవి స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికు అందించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. చిరంజీవి ఎల్లప్పుడూ సామాజిక సేవలో ముందుంటారని, ప్రజల సంక్షేమం కోసం అతని కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో వైరల్..
ఇక చిరంజీవి విరాళం ప్రకటనకు సంబంధిత ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు చిరు మానవతా సేవలను మరోసారి ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఇప్పటికే చిరంజీవి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం, వైద్య సాయం, నేత్రదానం వంటి అనేక సేవలను నిరంతరం అందిస్తూ వస్తున్నారు. రీసెంట్ గానే తన 70వ పుట్టినరోజును జరుపుకున్నారు చిరంజీవి. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇక మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే.. టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో "మన శంకరవరప్రసాద్ గారు" అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఇక దీనికి పండగకివస్తున్నారు అనే ట్యాగ్ ఇచ్చారు. ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్‌ను పూర్తిచేసుకుంది. చిరు సరసన నయనతార, కేథరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇప్పటికే వరుస హిట్లతో దూసుకుపోతున్నారు అనిల్ రావిపూడి. రీసెంట్ గానే సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ హిట్ అందుకుంది. ఏకంగా 300 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది. దాంతో ఈసారి చిరంజీవితో అనిల్ ఏ రేంజ్ హిట్ కొడతారో అని జోరుగా చర్చ నడుస్తోంది.












Click it and Unblock the Notifications