పడమర దిక్కులో ప్రధాన గేటు మంచిదేనా?

మానవ శరీరానికి ఆహారం ఎంత అవసరమో, ఇంటికి కూడా వాస్తు అంతే అవసరం. శరీరం ఆహారం లేకపోతే ఏ విధంగా నిరసించిపోతుందో, అనారోగ్యం పాలు అవుతుందో, అదేవిధంగా ఇంటికి వాస్తు లేకపోతే ఆ కుటుంబ పరిస్థితి కూడా దారుణంగా తయారవుతుంది. ఇప్పటివరకు మనం ప్రధాన గేటు ఏ దిశలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకున్నాం. నైరుతి దిశలో పొరపాటున కూడా ప్రధాన గేటు ఉండకుండా చూసుకోవాలని చెప్పుకున్నాం.

పడమర దిశలో ప్రధాన గేటు ఉంటే ఏం జరుగుతుంది?

ప్రస్తుతం మనం పడమర దిశలో ప్రధాన గేటు ఉంటే ఏం జరుగుతుంది ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకుందాం.వాస్తు ప్రకారం పడమర దిక్కుకు ప్రవేశద్వారం ఉండవచ్చు. పడమర దిక్కున ప్రధాన గేటు ఉండటం వల్ల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఉండవు. ఎటువంటి దోషాలకు తావులేదు. పశ్చిమ దిశకు అధిపతి వరుణదేవుడు. అటువంటి వరుణదేవుడు ఉన్న దిక్కు శుభంగానే ఉంటుంది.

west facing main gate Know the good or bad results of main gate facing west according to vastu

గేటును ఎప్పుడు ఈ భాగంలో ఏర్పాటు చేసుకోవడం మంచిది

అయితే వాస్తు నిబంధనల ప్రకారం గేటుస్థానం విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. గేటును ఎప్పుడు పడమర వాయువ్యం లేదా పడమర మధ్య భాగంలో ఏర్పాటు చేసుకోవడం మంచిది. ముఖ్యంగా పడమర మధ్య భాగంలో సుగ్రీవ మరియు పుష్ప దంత పాదాలు కలిగిన చోట ఏర్పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ గేటు వర్తక వ్యాపారాలు చేసే వారికి విశేషమైన ఫలితాలను ఇస్తుంది.

నైరుతి వైపున ప్రధాన గేటును ఏర్పాటు చేస్తే ఇబ్బందులు

వీరికి ధనలాభాలు ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. పొరపాటున కూడా గేటును నైరుతివైపున ఏర్పాటు చేయకూడదు. నైరుతి వైపున ప్రధాన గేటును ఏర్పాటు చేస్తే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది తీవ్రమైన ఆర్థిక నష్టాలకు, అనారోగ్య సమస్యలకు, అపకీర్తికి కారణమవుతుంది.ఇక పడమర వైపున ప్రధాన గేటును ఏర్పాటు చేసిన వారు ఏవైనా దోషాలు ఉంటే పరిహారాల ద్వారా నివారించుకోవచ్చు.

పడమర ప్రవేశ ద్వారం ఎదురుగా ఇవి పెట్టొద్దు

దీనికోసం ప్రధాన ద్వారం ఎల్లప్పుడు శుభ్రంగా ఉండేలా, వెలుతురుతో ఉండేలా చూసుకోవాలి. వాస్తు దోషాలను సరి చేయడం కోసం ప్రవేశద్వారం వద్ద బ్రాస్ తో తయారు చేసిన శ్రీ హెలిక్స్ వాస్తు యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక ప్రవేశ ద్వారం ఎదురుగా చెత్త డబ్బాలు, చెప్పుల స్టాండ్లు ఉండకుండా చూసుకోవాలి. అంతేకాదు చెట్లు, విద్యుత్ స్తంభాలు వంటివి అడ్డంకులు లేకుండా ఖాళీగా ఉండేలా చూసుకోవాలి.

ఆగస్ట్ 1 వరకు ఈ రాశులవారికి జాక్ పాట్.. శుక్ర సందేశం!
ఆగస్ట్ 1 వరకు ఈ రాశులవారికి జాక్ పాట్.. శుక్ర సందేశం!

ఈ రంగులు వేయాలి.. ఇలా చెయ్యాలి

స్థిరమైన శుభప్రదమైన శక్తిని పెంపొందించే మెటాలిక్ గ్రే, ముదురు నీలం, వుడ్ కలర్లను ప్రధాన గేటు కు వేసుకోవాలి. ఈ పరిహారాలను పాటిస్తే ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా తొలగిపోతాయి. పడమర దిక్కు మూసివేసినట్టు ఉండకుండా చూసుకోవాలి. అంతేకాదు పడమర దిక్కు గేటు ఉందని నైరుతి వైపు నీటి వినియోగం పెట్టుకోకూడదు. నైరుతి వినియోగం విషయంలో జాగ్రత్త. ఇలా చేస్తే పడమర గేటు అన్ని విధాలా శుభప్రదంగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+