శకం ముగిసింది: అమ్మ లాలిపాట శాశ్వతంగా ఆగిపోయింది..

దక్షిణ భారత సినీ సంగీత సామ్రాజ్యాన్ని దశాబ్దాల పాటు తన అమృత గానంతో ఏకఛత్రాధిపత్యంగా ఏలిన 'గానకోకిల' ఎస్. జానకి (88) అంతిమ యాత్ర అశ్రునయనాల మధ్య ముగిసింది. కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన ఆ మధుర గొంతుక శాశ్వతంగా మూగబోవడంతో సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. వయోభారం, అనారోగ్య సమస్యల కారణంగా శనివారం రాత్రి మైసూరులోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన జానకమ్మ భౌతికకాయానికి ఆదివారం సాయంత్రం కన్నీటి వీడ్కోలు పలికారు.

జానకమ్మ భౌతికకాయాన్ని ఈ ఉదయం 8 గంటల నుంచి ప్రజల సందర్శనార్థం మైసూరులోని చారిత్రాత్మక మహారాజా కాలేజీ గ్రౌండ్స్‌లో ఉంచారు. ఆ మధుర గాయనిని చివరిసారిగా చూసేందుకు వేలాది మంది అభిమానులు, సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు. జానకమ్మ పాడిన అజరామరమైన పాటలను గుర్తుచేసుకుంటూ, ఆమెతో తమకున్న అనుబంధాన్ని స్మరిస్తూ అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. ఒక తరం సంగీత శకానికి ముగింపు పడినట్లుగా ఆ ప్రాంగణమంతా శోకతప్త హృదయాలతో నిండిపోయింది.

End of a Musical Era Legendary Singer S Janaki Laid to Rest with Full State Honors in Mysuru

ప్రభుత్వ లాంఛనాలతో ఘన నివాళి!

సంగీత ప్రపంచానికి ఆమె చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా కర్ణాటక ప్రభుత్వం ఎస్. జానకి అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి, శృతి తప్పని ఆ గాన సరస్వతికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం మైసూరు సమీపంలోని కనియనహుండి వద్ద జానకమ్మ మనవరాలు అప్సర, ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.

సెలవు జానకమ్మా.. నీ పాట ఎప్పటికీ అమరమే!

జానకమ్మ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్, ఇళయరాజా వంటి అగ్రనేతలు, దిగ్గజాలు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. అమ్మ లాలిపాట నుంచి విరహ గీతం వరకు, భక్తి పాటల నుంచి జానపదాల వరకు ప్రతి భావాన్ని తన గొంతులో పలికించిన జానకమ్మ లేని లోటు ఎవరూ పూర్చలేనిది. రూపం కరిగిపోయినా, కాలం కలిసిపోయినా.. దక్షిణ భారతం ఉన్నంత కాలం ప్రతి ఇంట్లో, ప్రతి గుండెలో జానకమ్మ గొంతు మ్రోగుతూనే ఉంటుంది. శతాబ్దపు గానకోకిలకు నూతన శకపు అశ్రు నివాళులు!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+