Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చనిపోయిన చెల్లిని చేతులతో ఎత్తుకొని తీసుకెళ్లా.. మెగాస్టార్ ఎమోషనల్

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన తల్లి అంజనమ్మ, సోదరీలు విజయ దుర్గ, మాధవి.. తమ్ముడు నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది.

చెల్లి మరణం..

ప్రస్తుతం మేము ఇప్పుడు ఐదుగురం ఉన్నాం కానీ మరో ముగ్గురు బిడ్డలు మాత్రం చిన్న వయసులోనే చనిపోయారని చిరంజీవి చెప్పారు. తాను ఆరో తరగతిలో ఉన్నప్పుడు రమ అని చెల్లెలు ఉండేదని.. ఒకసారి ఆమె అనారోగ్యానికి గురైంది. దాంతో తాను, అమ్మ కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లామన్నారు. నాన్నకు ఆ విషయం తెలియదని.. రెండు రోజుల తర్వాత చనిపోవడంతో చెల్లిని చేతుల్లో ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లామని ఎమోషనల్ అయ్యారు. చుట్టుపక్కల వాళ్లు సాయం చేయడంతో ఆ తర్వాత కార్యక్రమాలు పూర్తి చేశామని వివరించారు. తెలిసిన వారి ద్వారా నాన్నకు సమాచారం అందించామని.. ఆయన వచ్చేసరికి అంతా అయిపోయిందన్నారు. ఆ క్షణాలు ఇప్పటికీ గుర్తుకు వస్తుంటాయని.. అప్పుడు ఎంతో బాధగా అనిపిస్తుందని వాపోయారు.

Megastar emotional as he carried his dead sister in his arms

పవన్ స్పెషల్ కిడ్..

అలానే ఇంట్లో చిన్నప్పుడు అందరికంటే తానే ఎక్కువగా చలాకీగా ఉండేవాడినని చిరు అన్నారు. ఇంట్లో పవన్ కళ్యాణ్ స్పెషల్ కిడ్ అని.. చిన్నప్పటి నుంచి తను సరిగ్గా తినేవాడు కాదని.. అందుకే అమ్మానాన్న బాగా గారాబం చేసారని.. తనకు నచ్చిన ఫుడ్ వండేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించేవారని నాగబాబు అన్నారు. ఇక ఇంట్లో తనకు నచ్చిన భోజనం లేకపోతే గొడవ చేసే వాడ్ని అని నాగబాబు చెప్పుకొచ్చారు. అన్నయ్య మాత్రం ఏం పెడితే అది సైలెంట్‌గా తినేవారని అన్నారు. కళ్యాణ్ బాబు మాత్రం నచ్చితే ఎక్కువగా తినేవాడని, నచ్చకపోతే వదిలేసి సైలెంట్‌గా వెళ్లేవాడని చెప్పారు. పవన్ కళ్యాణ్ సైలెంట్‌గా తన నిరసనను వ్యక్తం చేస్తే.. తాను మాత్రం కాస్త వైలెంట్ గా రియాక్ట్ అయ్యేవాడినని అన్నారు.

అల్లరితనం..

చిన్నతనంలో ఎలా ఉండేవారనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఓ సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఓ సారి పాక్కుంటూ ఎక్కడికో వెళ్లానని.. ఒళ్లంతా మసి పూసుకుని కూర్చొన్నానని.. ఈ పిల్లాడు ఎవరు? అని అంతా అనుకున్నారని చిరంజీవి తెలిపారు. అంజనమ్మ చూసి కూడా ఆ పిల్లాడు ఎవరో అన్నట్టుగా వదిలేసి తన బిడ్డ చిరంజీవి ఎక్కడ ఉన్నాడో వెతుక్కున్నారన్నారు. మళ్లీ ఎందుకో వచ్చి చూసి.. ఈ పిల్లాడు తన బిడ్డే అని ఎత్తుకున్నారని చెప్పారు.

అమ్మ సలహాలు..

ఇక తన తల్లి అంజనమ్మ గురించి విజయ దుర్గ, మాధవి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. అమ్మ కొండంత ధైర్యాన్ని ఇస్తుందని, అమ్మ ఇచ్చే సలహాలు, సూచనలే తమను ఈ స్థాయిలో నిలబెట్టాయని విజయ దుర్గ, మాధవి తెలిపారు. ఆ సమయంలోనే చిరంజీవి కూడా తన రెండో కూతురు శ్రీజ గురించి కూడా వివరించారు. శ్రీజ లైఫ్‌లో ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయని.. ఆ టైంలో నానమ్మ వద్ద ఎన్నో సలహాలు తీసుకుందని వెల్లడించారు. నానమ్మ వద్ద కూర్చుంటే ఎంతో పాజిటివ్‌గా ఉంటుందని తన కూతురు చెబుతుంటుందని అన్నారు. జీవితం ఎప్పుడూ ఆగిపోవద్దని.. ముందుకు సాగాలని.. మనసుకు ఏం నచ్చుతుందో అది చేయాలని శ్రీజకు అంజనమ్మ సలహాలు ఇచ్చారని స్పష్టం చేశారు.

ఆ టైమ్ లో డిప్రెషన్ లోకి..

అంతే కాకుండా అంజనమ్మ ఎంతో పాజిటివ్‌గా ఉంటారని, ఎప్పుడూ ధైర్యాన్ని చెబుతూ ఉంటారని చిరంజీవి తెలిపారు. కుటుంబ విలువలు, ఉమ్మడి కుటుంబం అనే కాన్సెప్ట్ ఆమె దగ్గరి నుంచే నేర్చుకున్నామని అన్నారు. అంత పాజిటివ్‌గా ఉండే వ్యక్తి.. ఓ సందర్భంలో కాస్త డిప్రెషన్‌లోకి వెళ్లారని చిరు తెలిపారు. నాన్న చనిపోవడం ఓ కారణం.. అప్పుడు అమ్మ దిగులు పడిపోయారు.. డిప్రెషన్‌లోకి వెళ్లారు.. ఆ టైంలో మాతో కాకుండా సపరేట్‌గా ఆమె ఉండేవారన్నారు. డిప్రెషన్ ‌లోకి వెళ్లిన టైంలోనే అమ్మను తన ఇంటికి తీసుకువచ్చానని వివరించారు. అలా డిప్రెషన్‌లో డల్‌గా ఉన్న అమ్మని చూసి కొన్ని మాటలు చెప్పానన్నారు. నీ పిల్లలు ఎంతో గొప్ప స్థాయికి వెళ్లారు.. కోట్ల మంది నీ బిడ్డల్ని ఆరాధిస్తుంటారు.. ఎన్నో వేల మందికి అండగా నిలిచే బిడ్డల్ని కన్నావ్.. నీ కంటే గొప్ప తల్లి ఎవరు ఉంటారమ్మా.. అలాంటి నువ్వు ఎంత సంతోషంగా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలి అని అమ్మతో చెప్పినట్టు చిరు వెల్లడించారు.

అన్నయ్య దగ్గర ఉంటే హ్యాప్పీ..

అన్నయ్య వద్ద అమ్మ ఉంటే అందరం హ్యాపీగా, నిశ్చింతగా ఉంటామని నాగబాబు, విజయదుర్గ, మాధవి తెలిపారు. అమ్మని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారని, హాస్పిటల్ అంటే ఎంత భయం ఉన్నా కూడా అన్నయ్య చెబితే.. అమ్మ ఆపరేషన్‌కు వెంటనే ఒప్పుకున్నారని నాగబాబు చెప్పారు.

మరోవైపు మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' మూవీ చేస్తున్నారు. ముగింపు దశకు చేరుకున్న ఈ మూవీ 2025 సమ్మర్‌లో విడుదల కానుంది. ఈ చిత్రంలో త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లను కూడా ప్రకటించారు మెగాస్టార్. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఓ మూవీ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అలానే అనిల్ రావిపూడితో కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+