హైదరాబాద్ టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చూస్తుండగానే కుప్పకూలిన టవర్: యష్ షాక్

పాన్ ఇండియన్ స్టార్ హీరో యష్ నటించిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అపశృతి చోటు చేసుకుంది. ఓపెన్ గ్రౌండ్ మధ్యలో ఏర్పాటు చేసిన ఓ టవర్ అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.

శనివారం రాత్రి హైదరాబాద్‌ మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ ఏర్పాటైంది. ఈ ప్రమోషనల్ ఈవెంట్‌కు సంబంధించిన ముందస్తు సమాచారంతో సీఎంఆర్ కాలేజీ విద్యార్థులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా యష్ అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో యూనివర్సిటీ ప్రాంగణం మొత్తం జనసంద్రంగా మారింది. గ్రౌండ్ మొత్తం కూడా వారి రాకతో క్రిక్కిరిసిపోయింది.

Mishap occurred during the pre release event of Yash starrer Toxic in Hyderabad Malla Reddy University

సౌండ్ బాక్సులను అమర్చడానికి గ్రౌండ్ అంతటా భారీ టవర్లను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారిలో కొందరు యువకులు ఈ టవర్లను ఎక్కారు. యష్ మాట్లాడే సమయంలో మరికొందరు ఈ టవర్ పైభాగానికి చేరుకోవడానికి ప్రయత్నించారు. దీంతో ఒత్తిడి ఎక్కువై అది చూస్తుండగానే కుప్పకూలింది. దీంతో అక్కడున్న వాళ్లు పరుగులు తీయడంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది.

స్టార్ యాక్టర్ కటౌట్ కు తగ్గ గెటప్: టాలీవుడ్ లో నెక్స్ట్ లెవెల్ మైథలాజికల్ థ్రిల్లర్
స్టార్ యాక్టర్ కటౌట్ కు తగ్గ గెటప్: టాలీవుడ్ లో నెక్స్ట్ లెవెల్ మైథలాజికల్ థ్రిల్లర్

ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులు, కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది అక్కడ తగిన సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన సదరు ఇద్దరు యువకులను పోలీసులు తక్షణమే చికిత్స నిమిత్తం సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

కరికాల ఛాప్టర్ 1.. తెలుగు తెరపై మరో మిస్టిక్, మైథలాజికల్ థ్రిల్లర్.. !!
కరికాల ఛాప్టర్ 1.. తెలుగు తెరపై మరో మిస్టిక్, మైథలాజికల్ థ్రిల్లర్.. !!

టవర్ కింద పడటాన్ని చూసిన వెంటనే యష్ షాక్ కు గురయ్యారు. తన ప్రసంగాన్ని మధ్యలో ఆపివేశారు. సెక్యూరిటీ సిబ్బందిని వెంటనే అక్కడికి వెళ్లాలని కోరారు. మిగిలిన టవర్లపై ఎక్కి కూర్చున్న వారిని కూడా కిందికి దిగాలని విజ్ఞప్తి చేశారు. అంతా సర్దుకున్నట్లు తెలిసిన తర్వాతే తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ ఘటనతో దాదాపుగా 15 నిమిషాల పాటు ఈ కార్యక్రమంలో అంతరాయం చోటు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+