IVF: ప్రపంచ చరిత్రలో సువర్ణాధ్యాయం.. దేశీయ గోవుకు తొలి ఆడ దూడ జననం
ఐవీఎఫ్.. పిల్లల కోసం పరితపించే ఎంతో మందికి ఆశాజ్యోతి. అయితే ఇప్పుడు ఈ ఐవీఎఫ్ విధానం భారాతవని కలలో కూడా ఊహించని ఓ కీలక ఘట్టానికి పునాది వేసింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ.. డైరీ రంగానికి, శాస్త్ర సాంకేతిక రంగానికి సరికొత్త వెలుగులు నింపుతూ వెటర్నరీ వర్సిటీ సైంటిస్టులు అరుదైన ఘనత సాధించారు.
అస్సాం రాష్ట్రానికి చెందిన స్వదేశీ జాతి 'లఖిమి' ఆవుకు సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటి ఆవు IVF (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) సాంకేతికత ద్వారా ఆడదూడకు జన్మనిచ్చింది. ఈ చారిత్రక ఘట్టంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక చిన్న దూడ జన్మించడం మాత్రమే కాదని, మన 'సభ్యత, సంస్కృతి, సృజన'ల సమ్మేళనమని అభివర్ణించారు.

రైతుల రాబడి పెంచేలా.. స్వదేశీ జాతుల సంరక్షణ
శాస్త్రవేత్తల ఈ అద్భుత ప్రయోగంతో అస్సాంలో పాల ఉత్పత్తి విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా స్థానిక వాతావరణానికి తట్టుకునే లఖిమి జాతి ఆవుల సంఖ్యను పెంచడం, వ్యాధుల నిరోధకతను పెంపొందించడం ద్వారా రైతుల ఆదాయాన్ని ద్విగుణీకృతం చేయవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ప్రయోగం వెనుక ఉన్న వెటర్నరీ శాస్త్రవేత్తలు, నిపుణులకు ఆయన అభినందనలు తెలిపారు.
Today Assam has achieved something historic - a beautiful convergence of Sabhyata, Sanskriti & Srijan.
— Himanta Biswa Sarma (@himantabiswa) August 22, 2026
The world’s first IVF female calf of the Lakhimi breed - native to Assam - has been born at the Assam Veterinary and Fishery University.
This landmark achievement opens new… pic.twitter.com/9KaVytPO11
శక్తి రంగంలో మరో బిగ్ లీప్: నూతన హైడ్రోకార్బన్ పాలసీ
ఒకవైపు పాడి పరిశ్రమలో విప్లవం సాధిస్తూనే, మరోవైపు ఇంధన రంగంలోనూ అస్సాం భారీ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా 'అస్సాం హైడ్రోకార్బన్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ పాలసీ-2026'ను అమలులోకి తెచ్చింది. దేశ ఇంధన రంగానికి అస్సాం ఎప్పటినుంచో ఆయువుపట్టుగా ఉందనడంలో సందేహం లేదు. ఇప్పుడు ప్రవేశపెట్టిన కొత్త పాలసీ రాబోయే 10 ఏళ్ల పాటు అమలులో ఉండనుంది. ఇది విదేశీ, స్వదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు సులభతర వ్యాపార నిర్వహణకు దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
వికసిత్ భారత్ దిశగా అస్సాం అడుగులు
ఈ కొత్త విధానంపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి ప్రశంసల జల్లు కురిపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమైన 'ఆత్మనిర్భర్ భారత్' వైపు అస్సాం అగ్రగామిగా నిలుస్తోందన్నారు. కేంద్ర మంత్రి ట్వీట్‌కు స్పందించిన సీఎం హిమంత, హైడ్రోకార్బన్ల అన్వేషణలో తమకున్న పాత అనుభవంతో సరిపెట్టుకోకుండా, కొత్త ఆవిష్కరణలతో 'వికసిత్ భారత్' లక్ష్య సాధనలో అస్సాం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications