బంగారం ధరలకు పూర్వవైభవం- రికార్డ్ బ్రాకెట్
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటోన్నాయి. అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. పూర్వవైభవాన్ని సంతరించుకునే దిశగా పయనిస్తోన్నాయి. గత వారం రోజులుగా పసిడి రేట్లలో వచ్చిన విపరీతమైన మార్పులు సాధారణ కొనుగోలుదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోన్నాయి. పెళ్లిళ్ల సీజన్ సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ధరల పెరుగుదల మధ్యతరగతి ప్రజలకు భారంగా మారింది.
అంతర్జాతీయంగా డాలర్ క్రమంగా బలహీనపడుతోంది. దీనితో పాటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అస్థిర పరిస్థితుల కారణాల వల్ల సురక్షితమైన ఆస్తిగా భావించే పసిడి వైపు పెద్ద ఎత్తున మదుపరులు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణామాలు గ్లోబల్ మార్కెట్‌లో డిమాండ్‌ను విపరీతంగా పెంచాయి. ఫలితంగా అంతర్జాతీయ సెంటిమెంట్ మద్దతుతో దేశీయ మార్కెట్లో కూడా రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టించే దిశగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,63,090 వద్ద స్థిరపడింది. 22 క్యారెట్లు రూ. 1,49,500 పలుకుతోంది. కిలో వెండి రూ. 2,60,000 వద్ద ట్రేడ్ అయింది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంధర రూ. 1,63,090, 22 క్యారెట్లు రూ. 1,49,500 కాగా ఇక్కడ వెండి కిలో రూ. 2,60,000 వద్ద నిలిచింది. బెంగళూరులో దాదాపుగా ఇవే రేట్లు నమోదయ్యాయి. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,63,290 కాగా 22 క్యారెట్లు రూ. 1,49,900, రూ. 2,63,000లుగా నమోదైంది.
మార్కెట్లు తిరిగి సోమవారం ఉదయం పునఃప్రారంభమైన తర్వాత బంగారం, వెండి ధరల్లో అంతర్జాతీయ క్లూస్ కీలక పాత్ర పోషిస్తాయి. డాలర్ ఇండెక్స్ కదలికలు, ఫెడరల్ రిజర్వ్ సమావేశాల నిర్ణయాలు, ప్రధాన ఫైనాన్స్ వ్యవస్థల ద్రవ్యోల్బణ గణాంకాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరల్లో మరిన్ని వ్యత్యాసాలు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 16,309, 22 క్యారెట్లు - రూ. 14,950, 18 క్యారెట్లు - రూ. 12,730
ముంబై..
24 క్యారెట్లు - రూ. 16,309, 22 క్యారెట్లు- రూ. 14,950, 18 క్యారెట్లు - రూ. 12,232
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 16,048, 22 క్యారెట్లు- రూ. 14,710, 18 క్యారెట్లు - రూ. 12,036
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 16,048, 22 క్యారెట్లు- రూ. 14,710, 18 క్యారెట్లు - రూ. 12,036
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 16,048, 22 క్యారెట్లు- రూ. 14,710, 18 క్యారెట్లు - రూ. 12,036
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 16,048, 22 క్యారెట్లు- రూ. 14,710, 18 క్యారెట్లు - రూ. 12,036













Click it and Unblock the Notifications