ఆ పోస్ట్‌తో షాకిచ్చిన Ar రెహమాన్..రిలేషన్‌పై ఓపెన్ టీమ్ మెంబర్
స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ భార్య సైరా బాను తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఏఆర్ రెహమాన్ నుండి విడిపోతున్నట్లు ధృవీకరిస్తూ ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. తమ మధ్య సయోధ్య చేయలేని దూరం పెరిగిపోయిందని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని సైరా బాను తన ప్రకటనలో చెప్పుకొచ్చారు. ఏఆర్ రెహమాన్‌కు ఆయన భార్య విడాకులు ఇవ్వడంపై సినీ వర్గాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి.
సరిగ్గా ఇదే సమయంలో ఏఆర్ రెహమాన్ టీంలోని ఓ మహిళ సైతం తన భర్తకు విడాకులు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఏఆర్ రెహమాన్ టీమ్ మెంబర్ మోహిని దే భర్తకు విడాకులు ఇచ్చినట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ''ప్రియమైన స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. భారమైన హృదయంతో, భర్త మార్క్ నేను విడిపోయామని ప్రకటిస్తున్నాను. మా ఇద్దరి పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాము.అంటూ తన సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చింది.

అయితే ఏఆర్ రెహమాన్ విడిపోతున్నట్లు ప్రకటించినకొన్ని గంటల్లో మోహిని దే పోస్ట్ పెట్టడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందనే ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై మోహిని దే క్లారిటీ ఇచ్చారు.తమపై వస్తోన్న రూమర్స్ ను ఆమె తీవ్రంగా ఖండించింది. ఇలాంటి రూమర్స్ మాట్లాడి విలువైన సమయాన్ని వృథా చేసుకోలేనంది. దయచేసి తమ ప్రైవసీని గౌరవించాలని కోరింది. మరోవైపు ఈ రెండు జంటల విడాకులకు ఎలాంటి సంబంధం లేదని ఏఆర్ రెహమాన్ మాజీ భార్య సైరా బాను తరపు లాయర్ స్పష్టం చేశారు.
Notice to all slanderers from ARR's Legal Team. pic.twitter.com/Nq3Eq6Su2x
— A.R.Rahman (@arrahman) November 23, 2024
మరోవైపు ఈ రూమర్లపై ఏఆర్ రెహమాన్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఏఆర్ రెహమాన్ టీమ్ తప్పుడు ప్రచారం చేసేవారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేయమని ఏఆర్ రెహమాన్ సూచించినట్లు ఓ ప్రకటనను విడుదల చేశారు. అంతేకాకుండా అభ్యంతన కంటెంట్‌ను 24 గంటల్లోపు తొలగించక పోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
-
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications