ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన సినిమా

Mr. Work From Home Review: ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు వస్తున్నాయి. రొటీన్ ప్రేమకథలు, యాక్షన్ సినిమాల కంటే భిన్నంగా సమాజానికి ఏదో ఒక సందేశాన్ని ఇస్తూ, ఆలోచింపజేసే చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే యువ హీరో త్రిగుణ్ నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'. మధుదీప్ చెలికాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, టైటిల్‌తోనే ఆసక్తిని కలిగించింది. మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో ఈ రివ్యూలో విశ్లేషించుకుందాం.

కరుప్పు(వీరభద్రుడు) ఎర్లీ రివ్యూ.. సూర్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్!
కరుప్పు(వీరభద్రుడు) ఎర్లీ రివ్యూ.. సూర్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్!

కథ:
అరవింద్ (త్రిగుణ్) అమెరికాలో సెటిల్ అయిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. కోట్లు సంపాదించే ఉద్యోగం ఉన్నా, మనసులో ఏదో వెలితి. మాతృభూమికి తిరిగి వచ్చి, సమాజానికి మేలు చేసే పని చేయాలనుకుంటాడు. నేటి కాలంలో రసాయన ఎరువుల వల్ల భూములు నిస్సారమవ్వడం, కలుషిత ఆహారం వల్ల మనుషుల ఆయుష్షు తగ్గిపోవడం అతడిని కలిచివేస్తుంది. దీంతో, సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఆర్గానిక్ వ్యవసాయం (ప్రకృతి వ్యవసాయం) వైపు అడుగులు వేస్తాడు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, సాంకేతికతను జోడించి 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' అనే ఓ వినూత్నమైన యాప్‌ను రూపొందిస్తాడు. ఈ ప్రయాణంలో అతనికి మహి (పాయల్ రాధాకృష్ణ) పరిచయమవుతుంది. అయితే, ఉద్యోగం లేని వాడిని పెళ్లి చేసుకోనని మహి అతడి ప్రేమని నిరాకరిస్తుంది. మరి అరవింద్ తన పట్టుదలతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాడా? రైతుల్లో మార్పు తెచ్చాడా? మహి మనసు గెలుచుకున్నాడా? అనేదే మిగతా కథ.

Mr Work From Home Review Trigun Inspiring Tale of Smart Farming and Organic Lifestyle Details

విశ్లేషణ:
దర్శకుడు మధుదీప్ చెలికాని ఎంచుకున్న పాయింట్ చాలా బాగుంది. 'వర్క్ ఫ్రమ్ హోమ్' అంటే ల్యాప్‌టాప్ ముందు కూర్చోవడం మాత్రమే కాదు, ఇంటి దగ్గరే ఉండి పొలం పనులను కూడా స్మార్ట్‌గా చేసుకోవచ్చని ఈ సినిమా ద్వారా నిరూపించారు. ఈ సినిమాలో ప్రధానంగా 'మిల్లెట్ల' ప్రాముఖ్యతను, మన పూర్వీకులు అనుసరించిన సంప్రదాయ ఆహార పద్ధతులను చక్కగా వివరించారు. 40 ఏళ్లకే వచ్చే అనారోగ్యాలకు అసలు కారణం మనం తింటున్న ఆహారమే అని కళ్లకు కట్టినట్లు చూపించారు. సినిమా మొదటి సగం పాత్రల పరిచయం, ప్రేమకథతో సాగినా.. రెండో సగం మాత్రం పూర్తిగా వ్యవసాయం, అందులోని సాధకబాధకాలు, టెక్నాలజీతో రైతుకు కలిగే లాభాల చుట్టూ తిరుగుతుంది. ఇది వరకు మహేష్ బాబు 'మహర్షి'లో రైతుల కష్టాలను చూస్తే, ఈ సినిమాలో రైతులు ఎలా 'స్మార్ట్' అవ్వాలో చూపించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ నుంచి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల వరకు అందరూ 'వర్క్ ఫ్రమ్ హోమ్', 'స్థానిక ఉపాధి' గురించి మాట్లాడుతున్నారు. ఈ తరుణంలో ఇలాంటి సినిమా రావడం యాదృచ్ఛికమైనా, ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది.

ప్రేక్షక దేవుళ్లా? బలిపశువులా?: ప్రజల్ని నిలువు దోపిడీ చేస్తున్న టాలీవుడ్ !!
ప్రేక్షక దేవుళ్లా? బలిపశువులా?: ప్రజల్ని నిలువు దోపిడీ చేస్తున్న టాలీవుడ్ !!

నటీనటుల ప్రతిభ
ఈ సినిమాలో త్రిగుణ్ నటన చాలా మెచ్యూర్డ్‌గా ఉంది. కొన్ని సీన్లలో అతని లుక్స్ రామ్ పోతినేనిని తలపించాయి. ఎమోషనల్ సీన్లలో, రైతులతో మాట్లాడే సన్నివేశాల్లో త్రిగుణ్ ఒదిగిపోయాడు. హీరోయిన్ పాయల్ చూడముచ్చటగా ఉండటమే కాకుండా, తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించింది. హీరో తండ్రిగా అవినాష్ కురువిల్లా, హీరోను వ్యవసాయం వైపు నడిపించే పాత్రలో శివాజీ రాజా తమ అనుభవంతో సినిమాకు బలాన్ని ఇచ్చారు.

సాంకేతిక నిపుణులు:
సినిమాలో డీఓపీ (సినిమాటోగ్రఫీ) హైలైట్ అని చెప్పాలి. పచ్చని పొలాలను, గ్రామీణ వాతావరణాన్ని చాలా సహజంగా చూపిస్తూనే, విజువల్స్ రిచ్‌గా ఉండేలా చూసుకున్నారు. సంగీతం, నేపథ్య సంగీతం కథలోని మూడ్‌ను బాగా ఎలివేట్ చేశాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాను మంచి ఆలోచింపజేసే కథాంశం రూపొందించారు. హీరో త్రిగుణ్ నటన అందరినీ ఆకట్టుకంటుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ , మిల్లెట్స్ పై ఇచ్చిన సందేశం ఎంతో బాగుంది. సాంకేతిక విలువలు ఈ సినిమా మేజర్ ప్లస్ పాయింట్‌గా నిలిచాయి.

మైనస్ పాయింట్స్:
ఈ చిత్రంలో కొన్ని చోట్ల కథనం నెమ్మదించింది. ప్రేమకథలో మరికొంత డెప్త్ ఉంటే బాగుండేది.

ఫైనల్‌గా:
'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, నేటి తరం యువతకు ఒక అవగాహన కలిగించే చిత్రం. టెక్నాలజీని వాడుకొని మన మూలాలైన వ్యవసాయాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఈ సినిమా చూపిస్తుంది. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ ఒక మంచి 'ఫీల్ గుడ్' మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ఇది.

రేటింగ్: 2.75/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+