పాత వీడియోతో కొత్త వివాదం.. మృణాల్ ఠాకూర్ యూటర్న్..!
Mrunal Thakur: ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక పాత వీడియో కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ వీడియోలో ఆమె నటి బిపాషా బసు శరీరంపై "మగాడిలా" అనే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు బాడీ షేమింగ్ కిందకు వస్తాయని నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. ఈ వివాదం పెరుగుతుండటంతో మృణాల్ ఠాకూర్ తన తప్పును గుర్తించి క్షమాపణలు తెలిపారు.
మృణాల్ ఠాకూర్ క్షమాపణలు
విమర్శల నేపథ్యంలో మృణాల్ ఠాకూర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ రాసుకొచ్చారు. అందులో ఈ విధంగా పేర్కొన్నారు. "19 ఏళ్ల వయసులో నేను చాలా మూర్ఖపు మాటలు మాట్లాడాను. నా మాటలకు ఎంత బరువు ఉంటుందో నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. సరదాగా అన్న మాటలు కూడా ఎంత బాధ కలిగించగలవో అప్పుడు నాకు తెలియదు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు.

అది ఒక ఇంటర్వ్యూలో జరిగిన ఒక సరదా సంభాషణ మాత్రమే. అది ఇంత పెద్ద వివాదంగా మారుతుందని నేను ఊహించలేదు. ఆ మాటలను వేరే విధంగా చెప్పి ఉండాలని నేను కోరుకుంటున్నాను.కాలంతో పాటు, అందం అనేది ఒకే రూపంలో ఉండదని, అది అనేక రూపాల్లో ఉంటుందని నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను దానికి నిజంగా విలువ ఇస్తున్నాను." అని మృణాలు ఠాకూర్ రాసుకొచ్చారు.
ఈ వైరల్ వీడియో మృణాల్ ఠాకూర్ "కుంకుమ్ భాగ్య" అనే సీరియల్‌లో నటిస్తున్న సమయం నాటిది. ఈ వీడియోలో ఆమెతో పాటు ఆమె సహనటుడు అరిజిత్ తనేజా కూడా ఉన్నారు. మృణాల్ క్షమాపణలు చెప్పిన తర్వాత చాలా మంది ఆమె నిజాయితీని మెచ్చుకున్నారు. ఈ సంఘటన సినీ ప్రముఖులు తమ మాటల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి గుర్తు చేసింది.












Click it and Unblock the Notifications