మెగా హీరోతో "గ్లామర్ క్వీన్" స్పెషల్ సాంగ్.. థియేటర్లు తగలబడడం పక్కా !!
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది "మృణాల్ ఠాకూర్" (Mrunal Thakur) . అనతి కాలంలోనే ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించినా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ టాలీవుడ్‌లో తన మొదటి సినిమా 'సీతారామం' బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మ ఫుల్ క్రేజ్ వచ్చింది. దుల్కర్ సల్మాన్‌తో ఆమె జోడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో చేసిన 'హాయ్ నాన్న' సినిమా కూడా మంచి విజయాన్ని సాధించగా.. విజయ్ దేవరకొండతో చేసిన 'ఫ్యామిలీ స్టార్' చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం మృణాల్ బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండగా.. తెలుగులో అడివి శేష్‌తో 'డెకాయిట్' అనే యాక్షన్ డ్రామాలో నటిస్తోంది.
ధనుష్‌తో ప్రేమ పుకార్లు..
గత కొన్ని నెలలుగా, మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) తమిళ స్టార్ హీరో ధనుష్‌తో రిలేషన్ లో ఉన్నట్టు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పలు పబ్లిక్ ఈవెంట్స్‌లో వారిద్దరూ కలసి కనిపించడం, ప్రత్యేకించి ఫ్రెండ్లీ బాండింగ్‌లో ఉండటం ఈ ఊహాగానాలకు మరింత ఊపునిచ్చింది. 2022లో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో తన 18 ఏళ్ల వివాహ బంధాన్ని ముగించారు. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దాంతో వీరు డేటింగ్ లో ఉన్నారని సోషల్ మీడియాలో సైతం చర్చ నడిచింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఈ క్రమంలోనే ఈమెకు సంబంధించి సినీవర్గాల్లో మరో విషయం హాట్ టాపిక్ గా మారింది.

కాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'పెద్ది'. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కాబోతుంది. చరణ్ నటించిన గత చిత్రం గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
గ్రామీణ వాతావరణంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కిస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియో లో ఫుల్ గా జుట్టు, గడ్డంతో చరణ్ రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించి అదరగొట్టారు. అలానే ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన 'చికిరి చికిరి' సాంగ్ మంచి స్పందన తెచ్చుకుంది. త్వరలోనే రెండో పాటను కూడా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమాలో ఒక స్పెషల్ మాస్ సాంగ్ ఉండబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) ఫస్ట్ టైమ్ ఐటం సాంగ్..
ఈ స్పెషల్ సాంగ్ కోసం మృణాల్ ( Mrunal Thakur ) ను మేకర్స్ సంప్రదించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకోసం ఏఆర్ రెహమాన్ మాస్ ట్యూన్ సిద్ధం చేసినట్లు సమాచారం. గ్రామీణ నేపథ్యానికి తగ్గ హుషారైన బీట్‌తో ఈ పాట ప్రేక్షకులను ఊపేస్తుందని డిస్కషన్ జరుగుతోంది. ఈ పాటకు మృణాల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. రామ్ చరణ్ మాస్ స్టెప్పులు + ఆమె గ్లామర్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడం పక్కా అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు.












Click it and Unblock the Notifications