ఆ స్టార్ హీరోయిన్ల ప్రేమలో పడిన 'కెప్టెన్ కూల్'.. మహీ మనసు దోచుకున్న ఆ బ్యూటీలు ఎవరంటే?

MS Dhoni Love Stories: భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయనే ట్రెండ్ అవుతున్నారు. కెప్టెన్ కూల్ ధోనీ సాధించిన అద్భుత రికార్డులతో పాటు ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితం, పాత ప్రేమకథలు కూడా నెట్టింట మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం తన భార్య సాక్షితో ఎంతో అన్యోన్యంగా వైవాహిక జీవితాన్ని గడుపుతున్న ధోనీ పేరు, పెళ్లికి ముందు పలువురు స్టార్ హీరోయిన్లతో గట్టిగానే వినిపించింది. ఈ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

IPLలో ధోనీ మ్యాజిక్: కెప్టెన్ కూల్ ఆ 5 రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు!
IPLలో ధోనీ మ్యాజిక్: కెప్టెన్ కూల్ ఆ 5 రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు!

ఆ బంధాన్ని మచ్చలా భావించిన రాయ్ లక్ష్మి
దక్షిణాది అందాల భామ రాయ్ లక్ష్మి, ఎంఎస్ ధోనీ మధ్య ప్రేమాయణం అప్పట్లో సంచలనం సృష్టించింది. 2009 ప్రాంతంలో వీరిద్దరూ డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎంఎస్ ధోనీ ఎప్పుడూ ఈ విషయంపై స్పందించలేదు. కానీ 2014లో రాయ్ లక్ష్మి తమ బంధాన్ని అంగీకరిస్తూనే బ్రేకప్ అనంతరం ఎదురైన చేదు అనుభవాలపై ఆవేదన వ్యక్తం చేశారు. విడిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్లినా మీడియా, ప్రజలు ధోనీ గురించే ప్రశ్నలు అడగటంతో ఆమె తీవ్ర అసహనానికి గురయ్యారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. "ధోనీతో నా బంధం నా జీవితంలో ఓ మచ్చలా మిగిలిపోయింది. ఎన్నేళ్లయినా జనం దాని గురించే మాట్లాడుకుంటున్నారు. భవిష్యత్తులో నా పిల్లలు ఈ వార్తలు చూసి నన్ను ఏం అడుగుతారోనని భయమేస్తుంది" అంటూ ఎమోషనల్ అయ్యారు.

MS Dhoni Past Love Stories From Deepika Padukone to Raai Laxmi Actresses Linked With Mahi

దీపికా పదుకొణె కోసం జుట్టు కత్తిరించుకున్న ధోనీ?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెతోనూ ధోనీ ప్రేమలో ఉన్నారంటూ అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. వీరిద్దరూ కలిసి ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేయడం, ఆ తర్వాత ఓ మ్యాచ్‌లో ధోనీని ఉత్సాహపరిచేందుకు దీపిక స్టేడియానికి రావడం ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చింది. అంతేకాకుండా దీపికా పదుకొణె కోరిక మేరకే ధోనీ తనకు ఎంతో ఇష్టమైన పొడవాటి జుట్టును కత్తిరించుకున్నారని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. అయితే కొంతకాలానికే వీరిద్దరి దారులు వేరయ్యాయి.

IPL 2027 రిటెన్షన్.. ఏ జట్టు ఎవరిని వదిలేసిందో తెలుసా?
IPL 2027 రిటెన్షన్.. ఏ జట్టు ఎవరిని వదిలేసిందో తెలుసా?

అసిన్‌తోనూ సాన్నిహిత్యం
స్టార్ హీరోయిన్ అసిన్ పేకు కూడా ధోనీతో వినిపించింది. వీరిద్దరూ కలిసి ఓ వాణజ్య ప్రకటనలో నటించినప్పుడు మంచి స్నేహితులయ్యారు. ఆ సాన్నిహిత్యం కాస్తా ప్రేమగా మారిందంటూ అప్పట్లో గుసగుసలు వినిపించాయి. అయితే ధోనీ గానీ, అసిన్ గానీ ఈ వార్తలను ఎప్పుడూ ధ్రువీకరించలేదు. ఆ తర్వాత ధోనీ 2010లో సాక్షిని వివాహం చేసుకుని తన జీవితంలో స్థిరపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+