బిగ్ షాక్ : రాజమౌళి - మహేష్ బాబు సినిమాకు బ్రేక్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇంత వరకు ఏ అప్డేట్ ని అధికారికంగా మూవీ యూనిట్ రిలీజ్ చేయలేదు. కానీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయకుండానే సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఈ మూవీలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారు. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం. ఇప్పటికే పలు షెడ్యూల్స్ ఫినిష్ చేసుకోగా ఇప్పుడు అనూహ్యంగా ఈ సినిమాకి బ్రేక్ పడినట్టు తెలుస్తోంది.

దర్శకుడు రాజమౌళి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన పెదనాన్న, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తండ్రి.. శివశక్తి దత్తా తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 92 సంవత్సరాలు కాగా వృద్ధాప్యం కారణం గానే మణికొండలోని తన నివాసంలో ఆయన నిన్న ( జూలై 7, 2025 ) రాత్రి మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

music-director-keeravani-father-sivasakthi-datha-passed-away

శివశక్తి దత్తా ప్రస్థానం..

శివశక్తి దత్తా.. తెలుగు సినీ రంగంలో రచయితగా, గేయ రచయిత సేవలు అందించారు. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. 1932 అక్టోబర్ 8న ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం సమీపంలోని కొవ్వూరు గ్రామంలో జన్మించారు. శివశక్తి దత్తాకు ముగ్గురు సంతానం - వారిలో ఎం.ఎం. కీరవాణి.. మరో సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్, రచయిత, సంగీత దర్శకుడు శివశ్రీ కంచి ఉన్నారు. అఅలానే ఆయనకు ఒక అన్న, అక్క, నలుగురు తమ్ముళ్లు ఉన్నారు. ఆయన తమ్ముడు ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌. ఎస్‌.ఎస్‌. రాజమౌళి, ఎం.ఎం.శ్రీలేఖకు శివశక్తి దత్తా పెద్దనాన్న అవుతారు.

తమ్ముడు విజయేంద్ర ప్రసాద్ స్ఫూర్తితో మద్రాసుకు వెళ్లి సినిమా రంగంలోకి ప్రవేశించారు. సినిమాల్లో రచయితగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. 1988లో 'జానకిరాముడు' సినిమాతో తొలి విజయాన్ని అందుకున్నారు. అనంతరం పలు హిట్ సినిమాలకు పాటలు రాసి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు.

music-director-keeravani-father-sivasakthi-datha-passed-away

గేయ రచయితగా రచించిన ప్రముఖ పాటలు..

బాహుబలి 1 - మమతల తల్లి, ధీవర

బాహుబలి 2 - సాహోరే బాహుబలి

ఆర్‌ఆర్‌ఆర్‌ - రామం రాఘవమ్

హనుమాన్ - అంజనాద్రి థీమ్ సాంగ్

ఎన్టీఆర్: కథానాయకుడు - కథానాయక

సై - నల్లా నల్లని కళ్ల పిల్ల

ఛత్రపతి - మన్నేళ తింటివిరా

రాజన్న - అమ్మా అవని

ప్రముఖుల నివాళి..

శివశక్తి దత్తా మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు సాహిత్య, సంగీత, కళారంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+