Same Sex: మంచును వేడెక్కిస్తోన్న నెటిజన్స్

న్యూఢిల్లీ: దేశంలో స్వలింగ సంపర్కుల వివాహ ప్రక్రియపై కొంతకాలంగా చర్చలు సాగుతున్నాయి. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధతను కల్పించాలని, దీనికి అధికారిక గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ విషయంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. పలు పిటీషన్లు దాఖలయ్యాయి.

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారమే తన తీర్పును వినిపించిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం సంచలన తీర్పుఇచ్చింది.

My heart is broken, says actress Manchu Lakshmi on the SC verdict on same sex marriage

స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించట్లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. స్వలింగ సంపర్కుల వివాహానికి దేశంలో అనుమతి లేదని తుది తీర్పు వినిపించింది. చట్టబద్ధతను కల్పించడానికి నిరాకరిస్తున్నట్లు వివరించింది. ఈ తీర్పు పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి.

దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. స్వలింగ సంపర్కుల వివాహాన్ని వ్యతిరేకిస్తోన్నామని స్పష్టం చేసింది. దీనికి చట్టబద్ధతను కల్పించడం, అధికారికంగా గుర్తింపును ఇవ్వడం సరికాదని తేల్చి చెప్పింది. ఐపీసీలోని సెక్షన్ 377 ప్రకారం- స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోవడం నేరమని తెలిపింది. స్వలింగ వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు అనేది చరిత్రలో లేదని వివరించింది. భిన్న లింగ వివాహానికి మాత్రమే గుర్తింపు ఉందని పేర్కొంది.

ఈ తీర్పు పట్ల ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తీర్పు తనను నిరాశకు గురి చేసిందని వ్యాఖ్యానించారు. తీర్పు విన్న తరువాత తన గుండె పగిలినట్టయిందని అన్నారు. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్దత కల్పించలేమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం సరికాదని పేర్కొన్నారు. యావత్ ప్రపంచానికి ప్రేమను బోధించిన భారత్‌కు ఇది అవమానకరమని చెప్పారు.

ఇతర దేశాల్లో ఎవరికి వారు స్వేచ్ఛగా తమ జీవితాలను కొనసాగిస్తున్నారని మంచు లక్ష్మి గుర్తు చేశారు. అలాంటి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని మన దేశంలో ఎందుకు కల్పించలేకపోతున్నామని అన్నారు. స్వలింగ సంపర్కుల వివాహాలను అంగీకరించలేమా? అంటూ ప్రశ్నించారు.

దీనిపై నెటిజన్ల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. మంచు లక్ష్మిపై ఘాటు కామెంట్స్ పోస్ట్ చేస్తోన్నారు యూజర్లు. మన సంప్రదాయాల గురించి తెలుసుకో.. అంటూ హితబోధ చేస్తోన్నారు. మీ అమ్మానాన్న ఇలాంటి సంస్కృతిని నేర్పించారా? అంటూ ప్రశ్నిస్తోన్నారు. సమాజంలో మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు తీర్పు ప్రతిబింబించిందని, దీన్ని తప్పపట్టడం సరికాదని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+