శోభితతో పెళ్లివేళ... సమంత గుర్తుగా నాగచైతన్య ఏం చేశాడో తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని నాగచైతన్య - సమంత జంట ఎంతో చూడముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్నారు. సినీ పరిశ్రమలోని పెద్దలతోపాటు సినీ ప్రియుల అభిమానాన్ని చూరగొన్నారు. అయితే ఏమైందో ఏంటోకానీ హఠాత్తుగా విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించి అందరినీ షాక్ కు గురిచేశారు. ఈ పరిణామాన్ని అక్కినేని అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోయారు. ఏదో ఒకరోజు తిరిగి వీరిద్దరూ కలిసిపోతారని భావించారుకానీ అది జరగలేదు. శోభిత ధూళిపాళను ఈరోజు రాత్రి మనువాడబోతున్నాడు.

ఓ ఫొటోను దాచుకున్న నాగచైతన్య
శోభితతో పెళ్లివేళ సమంత గుర్తుగా నాగచైతన్య ఓ వస్తువును గుర్తుగా దాచుకున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. విడాకులు తీసుకోవడానికి ముందు సమంత తన సోషల్ మీడియా ఖాతాలో నాగచైతన్య ఫొటోలను తీసేయడంతో విడాకులు తీసుకుంటున్నారని ఖాయమైంది. అయితే నాగచైతన్య వెంటనే ఫొటోలను తీసేయలేదు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఫొటోలను తీసేశాడు. అయితే ఇప్పటికీ నాగచైతన్య దగ్గర సమంత గుర్తుగా ఓ ఫొటోను ఉంచుకున్నాడు. అది మజిలీ సినిమాలోని ఫొటో. ఆ సినిమాలో వీరిద్దరూ హీరో, హీరోయిన్లుగా నటించారు. సినిమా సూపర్ హిట్ అయింది.

Naga Chaitanya hide a photo from the movie Majili as a reminder of Samantha

ఆ ఫొటోతోపాటు చెట్లను కూడా..
ఆ సినిమాలోని పోస్టర్ ను సోషల్ మీడియా ఖాతాలో గుర్తుగా దాచుకోవడంతో నాగచైతన్యకు సమంతపై ప్రేమ తగ్గలేదని, ఇంకా ఆమె జ్ఞాపకాల్లోనే ఉన్నాడని అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే సమంత ఉన్నప్పుడు నాటిన చెట్లను ఎంతో ప్రేమగా వాటిని సంరక్షించుకుంటూ వస్తున్నాడు. దీంతోపాటు ఆ ఫొటోను కూడా తీయకుండా ఉండటంతో సమంత జ్ఞాపకాల్లోనే నాగచైతన్య ఉన్నాడంటున్నారు. ఈరోజు రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య-శోభిత వివాహం జరగబోతోంది. దాదాపు ఎనిమిది గంటలపాటు వివాహ క్రతువు ఉండబోతోంది. శోభిత బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో వారి సాంప్రదాయం ప్రకారమే వివాహాన్ని జరుపుతున్నారు. సాయంత్రం 8.00 గంటల తర్వాత వివాహ క్రతువు ప్రారంభం కాబోతోంది. ఆడంబరాలకు పోకుండా కేవలం 300 మంది అతిథుల మధ్యే ఈ వివాహం జరగబోతోంది. అక్కినేని నాగార్జున భారీగా చేయాలనుకున్నప్పటికీ నాగచైతన్య వద్దని చెప్పడంతో సింపుల్ గా చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+