అప్పుడు సమంత కోసం.. ఇప్పుడు సాయిపల్లవి కోసం!
తెలుగు సినీ పరిశ్రమలో ఏమాయ చేశావే సినిమా ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటుంది. ప్రేమ కథా చిత్రాల్లో ఇది అరుదైన సినిమాగా నిలిచిపోతుంది. హీరో హీరోయిన్లుగా నటించిన నాగచైతన్య, సమంతను స్టార్ హీరో, స్టార్ హీరోయిన్లుగా ఈ చిత్రం మార్చేసింది. ఏమాయ చేశావే చేసే సమయంలోనే వీరిద్దరి మధ్య కుదిరిన స్నేహం తర్వాత ప్రేమగా మారింది. ఆ తర్వాత వివాహం చేసుకోగా, నాలుగు సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరికి వారుగా సినిమాలు చేసుకుంటున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో సమంత పరోక్షంగా నాగచైతన్యను విమర్శించికానీ, నాగచైతన్య మాత్రం ఇప్పటివరకు సమంతను ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ పల్లెత్తు మాట అనలేదు. అది నాగచైతన్య వ్యక్తిత్వాన్ని, సంస్కారాన్ని తెలియజేస్తోందని అక్కినేని అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు.
ఆ సినిమా చేసే సమయంలో హీరోయిన్ పాత్ర హైలైట్ అవుతుందని, హీరోకన్నా హీరోయిన్ కే ఎక్కువ పేరొస్తుందని తెలిసినా నాగచైతన్య నటించాడు. కేవలం సమంత కోసమేనని చెబుతుంటారు. తన పాత్ర హైలైట్ కాకపోయినా పర్వాలేదు.. మనసుకు నచ్చిన పాత్ర చేయాలి అనేదే చైతూ ఉద్దేశం. అందుకే ఆ ఉద్దేశంతోనే నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని కైవసం చేసుకున్నాడు. తాజాగా తండేల్ పేరుతో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

తండేల్ లో కూడా కథ ప్రకారం సాయిపల్లవి పాత్ర హైలైట్ అవుతుంది. అయినా నాగచైతన్య ఒప్పుకున్నాడు. తను కాబట్టి ఒప్పుకున్నాడని, మరో హీరో అయితే ఎవరూ చేయరంటున్నారు. అప్పుడు సమంత కోసం త్యాగం చేశాడు.. ఈరోజు సాయిపల్లవి కోసం త్యాగం చేశాడంటూ అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications