నాగచైతన్య- సమంత - శోభిత ధూళిపాళ కాంబోలో మిస్ అయిన బ్లాక్‌బస్టర్
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య తెలుగమ్మాయి, బాలీవుడ్ నటి అయిన శోభిత ధూళిపాళను డిసెంబరు నాలుగున వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట అన్యోన్యంగా కాపురం చేస్తోంది. శోభితను చేసుకోవడానికి ముందు నాగచైతన్య కొన్ని సంవత్సరాలు తన తోటి హీరోయిన్ సమంతను ప్రేమించి తర్వాత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా తామిద్దరం విడిపోతున్నట్లు 2021లో ప్రకటన చేశారు. దీంతో సినీ పరిశ్రమ మొత్తం షాక్ కు గురైంది. ఆ తర్వాత నుంచి సమంత ఒంటరిగానే జీవిస్తోంది. మధ్యలో మయోసైటిస్ వ్యాధికి గురై చికిత్స తీసుకుంది.
శోభితను కాదని దివ్యాన్షను తీసుకున్నారు
నాగచైతన్య- సమంత కాంబినేషన్ లో ఏమాయ చేశావే, మనం, మజిలీ, ఆటోనగర్ సూర్య లాంటి సినిమాలు వచ్చాయి. మజిలీ సినిమాలో నాగచైతన్య, సమంత పోటీపడి నటించారు. ఈ సినిమాలో వీరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. కథ ప్రకారం ఆ పాత్రల్లో మంచి డెప్త్ ఉంది. ఈ సినిమాలో వీరిద్దరితోపాటు దివ్యాన్ష కౌశిక్ కూడా నటించింది. మజిలీలో ఈమెను నాగచైతన్య ముందుగా ప్రేమిస్తాడు. మరోవైపు సమంత నాగచైతన్యను ప్రేమిస్తుంటుంది. దివ్యాన్ష కౌశిక్ కు ముందు ఆ పాత్రలో దర్శకుడు శివ నిర్వాణ శోభిత ధూళిపాళను తీసుకున్నారు. ఆమెపై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. అనుకోని కారణాలవల్ల ఆ పాత్రకు శోభిత దూరమైంది.

ఆ సినిమా సమయంలోనే కొత్తగా పరిచయమైంది
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే శోభితకు, నాగచైతన్యకు పరిచయం జరిగింది. దర్శకుడు దివ్యాన్ష కౌశిక్ ను తీసుకున్న తర్వాత షూటింగ్ జరుపుకొని విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. సమంతతో విడిపోయిన కొన్నాళ్లకు నాగచైతన్య శోభిత ధూళిపాళను ప్రేమించాడు. హఠాత్తుగా నాగార్జున ఇంట్లో ఈ జంట నిశ్చితార్థం జరుపుకుంది. తర్వాత వివాహం కూడా అన్నపూర్ణ స్టూడియంలో కేవలం 300 మంది అతిథుల మధ్య సింపుల్ గా నిర్వహించారు. నాగచైతన్య కోరిక మేరకే అలా సింపుల్ గా చేయాల్సి వచ్చిందని నాగార్జున చెప్పారు. అతని మరో తనయుడు అఖిల్ కూడా త్వరలోనే పెళ్లికొడుకు కాబోతున్నాడు. తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు.












Click it and Unblock the Notifications