సమంతకు భారీ షాక్ ఇచ్చిన నాగచైతన్య

ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బ్యూటీ సమంత. ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగిచూసుకోవాల్సిన అవసరం ఈ అమ్మడుకు రాలేదు. అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ కథానాయికగా మారిపోయింది. ఈ క్రమంలోనే అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు. మూడు సంవత్సరాల్లోపే విడిపోయారు. వీరిద్దరు విడిపోయిన తర్వాతే సమంతకు ఇంకా పాపులారిటీ పెరిగిందని చెప్పొచ్చు. తాను ఎక్కడకు వెళ్లినా, ఏం చేస్తున్నా.. వాటినన్నింటినీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంటుంది.

ఏడాది పాటు దూరంగా
మయోసైటిస్ వచ్చిన తర్వాత చికిత్స కోసం ఏడాదిపాటు సినిమాలకు విరామం ప్రకటించింది. ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. తన సొంత నిర్మాణ సంస్థలో చిత్రంతోపాటు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోయే చిత్రంలో కథానాయికగా ఎంపికైందంటున్నారు. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో సమంతమీద ఎప్పుడూ ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.

nagachaitanya tandel movie unit released to saipallavi birthday special video

సమంతను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని వారిద్దరూ ఖండించారు. పరోక్షంగా దీనిపై సమంత కూడా కామెంట్స్ చేసింది. అయితే విడాకులిచ్చేసిన తర్వాత నీకెందుకు అతని సంగతి అంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. తాజాగా సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా తండేల్ చిత్ర యూనిట్ ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో సాయిపల్లవి నాగచైతన్యకు ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తుంటుంది. దీనిపై ట్రోలర్స్ మీమ్స్ తయారు చేశారు. సమంతకు నాగచైతన్య మరోసారి షాక్ ఇచ్చాడంటున్నారు. నువ్వు లేకపోయినంత మాత్రాన తనను అర్థం చేసుకునేవారు లేరనుకుంటున్నావా? లేదంటే అతనికి ప్రేమను పంచేవారు లేరనుకుంటున్నావా? నువ్వొక్కదానివే సొంతమైనట్లు మాట్లాడుతున్నావు? విడిపోయిన తర్వాత నీకు నాగచైతన్య గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అని ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+