బాలయ్యను జీవితాంతం వెంటాడే బాధ అదొక్కటేనా..?

తెలుగు సినీ, రాజకీయ రంగాల్లో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. నందమూరి తారక రామారావు తెలుగునాటు మహానటుడిగానే, మహానాయకుడిగా కూడా ఎంతో కీర్తిప్రతిష్టలు అందుకున్నారు. నటుడిగా ఎన్నో పాత్రలు వేసి దేశంలో తెలుగు వారికి ఒక గుర్తింపుని తీసుకువచ్చారు. అటు రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చి టీడీపీని స్థాపించి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇటీవలే ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు సైతం ఘనంగా నిర్వహించారు. ఆయన వారసులుగా సినీ పరిశ్రమకు సైతం బాలయ్య, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్నారు.

ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి నటసింహం బాలయ్యకి దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. తెరపై ఆయన మాస్ డైలాగ్స్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి భారీ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ నటవారసత్వాన్ని కొనసాగిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఒక వైపు రాజకీయంగా తన తండ్రి పెట్టిన తెలుగు దేశం పార్టీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ సాధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు సినిమాల్లో కూడా వరుసగా నాలుగు సినిమాలు హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నారు.

nanadamuri-balakishna-emotional-words-about-his-marraige

బాలయ్య సినిమా కెరీర్ విషయానికి వస్తే.. 1974లో 'తాతమ్మకల' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వందకు పైగా చిత్రాలను పూర్తి చేసుకొని తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి 'డాకు మహరాజ్'తో హిట్ అందుకున్న ఆయన.. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు. 'అఖండ' మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. ఈ మూవీలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ హిట్స్ అందుకోగా.. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి

అయితే బాలకృష్ణకి మాత్రం జీవితాంతం వెంటాడే బాధ ఓ విషయంలో జరిగిందట. రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో ఆ విషయం గురించి బాలయ్య ఓపెన్ అయ్యారు. అది తన వివాహం గురించి అని.. తన పెళ్ళికి తీయను దైవంగా భావించే తన తండ్రి లేకపోవడం.. అన్నయ్య హరికృష్ణ కూడా రాకపోవడం చాలా బాధకలిగించిందని వాపోయారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చి తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

అసలు ఏం జరిగిందంటే..

ఎన్టీఆర్ కి మొత్తం 12 మంది సంతానం. వారిలో 8 మంది కొడుకులు, 4 కూతుళ్లు. అందుకే వారి ఇంట ఏ వేడుక జరిగినా కూడా పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. అయితే బాలకృష్ణ వివాహంతో పాటే అదే రోజు ఆయన మరో కుమారుడు రామకృష్ణ పెళ్లి కూడా జరిగింది. 1982 డిసెంబ‌ర్ 8న అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుకలను జరిపారు. కానీ పెళ్ళికి మాత్రం ఆయన తండ్రి ఎన్టీఆర్, అన్న హరికృష్ణ రాలేదట.

సొంత కొడుకుల పెళ్ళికి ఎన్టీఆర్ రాకపోవడానికి ఏకైక కారణం రాజకీయం అని అంటున్నారు. సరిగ్గా బాలకృష్ణ పెళ్ళి జరిగే సమయానికి ఎన్టీఆర్ ప్రజా చైతన్య యాత్రలో ఉన్నారు. సరిగ్గా అదే టైమ్ లో పార్టీ పెట్టిన ఎన్టీఆర్ యాత్ర పేరుతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రజా చైతన్య యాత్రకు రధసారధిగా హరికృష్ణ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యాత్రకు బ్రేక్ ఇవ్వడం కుదరక.. ఎన్టీఆర్, హరికృష్ణ పెళ్ళికి రాలేదట. అయితే తిరుపతిలో వీరి వివాహం జరిగిన తరువాత బాలయ్య సరాసరి వెళ్లి.. యాత్రలో ఉన్న ఎన్టీఆర్ ఆశీర్వాదాలు తీసుకున్నారట.

nanadamuri-balakishna-emotional-words-about-his-marraige

అలా మొత్తానికి బాలకృష్ణ ‌ - వసుందరా దేవి వివాహం జరిగిందని చెబుతారు. వ‌సుంద‌ర దేవి తండ్రి ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త దేవుర‌ప‌ల్లి సూర్యారావు. అప్పట్లో ఎన్టీఆర్ రామోజీరావు ఇద్దరు సన్నిహితంగా ఉండేవారు. ఎన్టీఆర్ కోసం రామోజీరావు పెళ్లి పెద్దగా మారి వారిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలను ఒప్పించారని.. పెళ్లి సమయంలో ఎన్టీఆర్, హరికృష్ణ దగ్గర లేకపోయినా కూడా రామోజీ రావే ఆ పెళ్లి పనులను తన మీద వేసుకొని గ్రాండ్ గా జరిపించారని నందమూరి ఫ్యామిలీ సన్నిహితులు అంటుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+