ఆ డైరెక్టర్ తో బాలయ్య... ఫ్యాన్స్ కు పూనకాలే
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ హిట్ కొట్టి మంచి జోరుమీద ఉన్నారు. బాబీ దర్శకత్వంలో తర్వాత సినిమా చేస్తున్నారు. దీనిమీద కూడా అంచనాలు భారీగా నెలకొన్నాయి. కాలానికి అనుగుణంగా తాను కూడా మారుతూ, కథలను ఎంచుకుంటున్న ఆయనకు విజయాలు వరుసగా పలకరిస్తున్నాయి.
ఆయన కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాలుగా ఆదిత్య 369, బైరవద్వీపం ఫిక్షన్ కంటెంట్ తో అలరించాయి. ఆదిత్య 369 సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఎంతో అద్భుతంగా తెరకెక్కింది. భైరవ ద్వీపంలో ఫిక్షనల్ అంశాలను అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

తాజాగా బాలయ్య మైథలాజికల్ ఫాంటసీ మల్టీవర్స్ లో అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. విభిన్నమైన కథలతో సినిమాలను తీస్తున్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కుర్ర డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రస్తుతం హనుమాన్ చిత్రం చేస్తున్నారు. తెలుగులో మొట్టమొదటి సూపర్ హీరో కథగా తెరెకక్కింది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది.
దీని విడుదలకు ముందే ప్రశాంత్ వర్మ బాలయ్యకు మైథలాజికల్ ఫాంటసీ మల్టీవర్స్ కథను వినిపించినట్లు, ఈ కథ చేయడానికి బాలకృష్ణ కూడా సుముఖత చూపించినట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైన ఫ్యాన్స్ కు పూనకాలు లాంటి వార్తే అని చెప్పవచ్చు. భగవంత్ కేసిరి చిత్రంతో సూపర్ హిట్ ఇచ్చిన బాలయ్య.. తర్వాత బాజీ దర్శకత్వంలో కూడా మరో సూపర్ హిట్ ఇవ్వబోతున్నాడని బాలయ్య అభిమానులు సంబరంగా చెప్పుకుంటున్నారు.












Click it and Unblock the Notifications