రేయ్ తారక్.. బాగా చేశావురా.. కంగ్రాట్స్: బాలకృష్ణ
నందమూరి కుటుంబంలో బాలయ్య కుటుంబానికి, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి విభేదాలు నడుస్తున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎడముఖం, పెడముఖంగా ఉన్న బాలయ్య, తారక్ గతంలో చాలా బాగా కలిసివుండేవారు. హరికృష్ణ జీవించి ఉన్న సమయంలో తారక్ ను, కల్యాణ్ రామ్ ను తన సొంత కొడుకులుకన్నా ఎక్కువగా బాలయ్య చూసుకున్నాడు. తర్వాత ఏమైందో తెలియదుకానీ హరికృష్ణ మరణించిన తర్వాత విభేదాలు ముదిరిపోతూ వచ్చాయి. చివరికి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇటువంటి తరుణంలో కల్యాణ్ రామ్ కూడా తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ కే మద్దతుగా నిలబడ్డాడు. వీరిద్దరికీ బాలయ్యతో దూరం పెరిగింది.
ప్రసాద్ ల్యాబ్స్ లో స్పెషల్ షో
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ బాలయ్యతో సినిమా తీద్దామని కలిశాడు. వినాయక్ దర్శకత్వంలో ఆది తీశానని, తర్వాత మళ్లీ వినాయక్ దర్శకత్వంలోనే మీతో సినిమా చేస్తామని చెప్పి వినాయక్ ను పరిచయం చేశాడు. ఆది సినిమా తీసింది ఇతనే అంటూ తెలిపాడు. దీంతో బాలయ్య వినాయక్ ను అభినందించారు. సినిమా బ్లాక్ బస్టర్ అని తెలుసుకానీ దర్శకుడు నువ్వని తెలియదంటూ చెప్పారు. ఆది తీశావు కాబట్టి వెంటనే అది చూడాలన్నారు. ప్రసాద్ ల్యాబ్స్ లో బెల్లంకొండ సురేష్, వినాయక్ బాలయ్య కోసం ప్రత్యేకంగా ఆది సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమా చూడగానే వారిని అభినందించి వెంటనే జూనియర్ ఎన్టీఆర్ కు ఫోన్ చేయమని ఆదేశించాడు.

సినిమా బ్రహ్మాండంగా ఉంది..
ఫోన్ అందుకొని రేయ్.. తారక్.. సినిమా చాలా బాగా చేశావురా.. కంగ్రాట్స్.. సినిమా మాత్రం బ్రహ్మాండంగా ఉంది.. నీ నటన కూడా చాలా బాగుందంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. దీంతో తారక్ పొంగిపోయాడు. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బెల్లంకొండ సురేష్ తెలిపాడు. బాలయ్యబాబుది వెన్నపూస లాంటి మనస్తత్వం అని, కోపం వచ్చినా ఉంచుకోలేరు.. ప్రేమ పొంగినా ఆపుకోలేరని, వెంటనే వ్యక్తపరుస్తారంటూ బాలయ్య గురించి సురేష్ చెప్పాడు. చివరగా సురేష్ బాలయ్యతో లక్ష్మీ నరసింహ సినిమా తీశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. థియేటర్లలో బాగా ఆడుతున్న సమయంలో హఠాత్తుగా ఈ సినిమాను తీసేసిన విషయంలో నిర్మాతకు, బాలకృష్ణకు వివాదం జరిగి అది కాల్పులకు దారితీసింది. ప్రస్తుతం మళ్లీ బాలకృష్ణతో సినిమా తీస్తానని సురేష్ ప్రకటించాడుకానీ బాలయ్య కాల్షీట్లు ఇవ్వడం కష్టమే అంటున్నారు అభిమానులు.












Click it and Unblock the Notifications