సినీ ఇండస్ట్రీలో అరుదైన రికార్డ్ నెలకొల్పిన బాలకృష్ణ
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్నారు. అగ్ర కథానాయకుల్లో ఎవరికీ సాధ్యంకాని రీతిలో వరుసగా హ్యాట్రిక్ హిట్లు సాధించారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో ఆయన ఈ ఘనతను అందుకున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కథ కూడా విభిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కూడా బాలయ్య తనకు అచ్చొచ్చిన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ ఏడాది విజయ దశమికి లేదంటే సంక్రాంతికి దీన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.
210 రోజుల పూర్తి
బాలయ్య తన చివరి చిత్రం భగవంత్ కేసరితో తెలుగు సినీ పరిశ్రమలో మరో అరుదైన రికార్డును నెలకొల్పారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్ లో ఈ సినిమా 210 రోజులు పూర్తిచేసుకుంది. సినిమా విడుదలైన ఏడు నెలల నుంచి ఈ సినిమా ఇక్కడ ప్రదర్శింపబడుతూనే ఉంది. గతంలో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా కూడా ఈ థియేటర్ లో 200 రోజులు ఆడింది. భగవంత్ కేసరి చిత్రం రూ.132 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి రూ.70 కోట్ల షేర్ ఇచ్చింది.

సూపర్ హిట్ గా అఖండ
అఖండ సినిమా ముందువరకు వరుసగా ఫ్లాప్స్ రావడంతో ఎటువంటి కథను ఎంచుకోవాలో అర్థంకాని స్థితిలో ఉన్న బాలయ్య బోయపాటి దర్శకత్వంలో చేసిన అఖండ సంచలన విజయం సాధించింది. రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తర్వాత బాలయ్య ఇంతవరకు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. ఆహాలో చేసిన అన్ స్టాపబుల్ షో కూడా బాలయ్యకు ఈ తరం యువతలో క్రేజ్, ఇమేజ్ రావడానికి కారణమైందని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications