వరుణ్ తేజ్ పెళ్లికి బాలకృష్ణ అరుదైన గిఫ్ట్!
మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో అతిథుల మధ్య వైభవోపేతంగా జరిగింది. అనంతరం నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఆరు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట పెద్దలను ఒప్పించి ఓ ఇంటివారయ్యారు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది ఇటలీలోనే కనుక వివాహం అక్కడే చేసుకున్నారు.
తెలుగు సంప్రదాయానికి అనుగుణంగా వివాహం జరగడంతో మెగా అభిమానులు సంతోషించారు. రాజకీయంగా, సినిమాల పరంగా బిజీగా ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ సతీసమేతంగా హాజరవడం ఆయన అభిమానులను, మెగా అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.

వరుణ్ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి బహుమతి ఇస్తాడా? అని మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూశారు. చిరంజీవి రెండుకోట్ల రూపాయలు విలువచేసే ఖరీదైన డైమండ్ సెట్ ను బహుమతిగా ఇచ్చారు. అలాగే పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా రూపొందించిన ఫీచర్లతో ఉన్న కారును బహుమతిగా ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ ఒక అరుదైన బహుమతిని దంపతులకు పంపారు. పుల్లలతో తయారుచేసిన వెంకటేశ్వరస్వామి ప్రతిమను వారి పెళ్లి బహుమతిగా ఇచ్చారు. నాగబాబు, పద్మ, వరుణ్ తేజ్, నీహారిక వెంకటేశ్వరస్వామిని బాగా నమ్ముతారు. దీంతో జీవితాంతం గుర్తుండిపోయే బహుమతి ఇవ్వాలని భావించిన బాలయ్య ఈ ప్రతిమను ప్రత్యేకంగా తయారుచేయించారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి సూపర్ హిట్ కావడంతో బాలయ్య తర్వాత ప్రాజెక్టుపై పరిశ్రమలో ఆసక్తి పెరిగింది. బాబీ దర్శకత్వంలో చేయబోతున్న చిత్రంలో ఆయన డిఫరెంట్ క్యారెక్టర్ పోషించబోతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications