నందమూరి బాలకృష్ణకు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు.. జై బాలయ్య !!

జై బాలయ్య.. జై జై బాలయ్య.. లోకల్ అయినా నాన్ లోకల్ అయినా.. ఇండియా అయినా.. ఫారెన్ అయినా.. ప్లేస్ ఏదైనా కానీ.. ఈ ఒక్క పేరు చాలు షేక్ ఆడించడానికి. నందమూరి నటసింహం బాలయ్యకి దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. తెరపై ఆయన మాస్ డైలాగ్స్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి భారీ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ నటవారసత్వాన్ని కొనసాగిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో సైతం అభిమానులు ఉన్నారు. ఒక వైపు రాజకీయంగా తన తండ్రి పెట్టిన తెలుగు దేశం పార్టీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ సాధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు సినిమాల్లో కూడా వరుసగా ఐదు సినిమాలు హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా బాలకృష్ణ మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు.

nandamuri-balakrishna-got-life-time-achievement-award-at-international-film-festival-of-delhi-2026

దేశ రాజధాని ఢిల్లీ వేడుకగా 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ దిల్లీ (IFFD) 2026' వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యారు. 'భారత్ మండపం' వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో బాలయ్యకు ప్రతిష్టాత్మక 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్' (జీవితకాల సాఫల్య) పురస్కారాన్ని అందజేశారు. దశాబ్దాలుగా సినిమా రంగానికి ఆయన చేసిన విశేష కృషిని గుర్తిస్తూ నిర్వాహకులు ఈ అవార్డుతో సత్కరించారు. ఈ వేడుకల్లో బాలకృష్ణతో పాటు ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్, దివంగత లెజెండరీ నటుడు ధర్మేంద్ర (ఆయన తరఫున కుటుంబసభ్యులు)ను కూడా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో గౌరవించారు. ముఖ్యమంత్రి రేఖాగుప్తా చేతులమీదుగా ఈ అవార్డులు ప్రధానం జరిగింది.

కాగా ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు మంత్రులు కపిల్ మిశ్రా, పర్వేశ్‌ సాహిబ్ సింగ్ వర్మ, నటీమణులు హేమమాలిని, కంగనా రనౌత్, షర్మిలా ఠాగూర్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు. ఢిల్లీ పర్యాటక, రవాణా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చలనచిత్ర ఉత్సవాలు మార్చి 31 వరకు కొనసాగనున్నాయి. వివిధ భాషా చిత్రాలను ఈ వేడుకలో ప్రదర్శించనున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుంది. NBK111 అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ నిర్మించానున్నారు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ కూడా చేశారు. ఈ చిత్రంలో బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. పిరియాడికల్ మైథాలజీ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందించబోతున్నారు. వృధ్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా.. లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+