నందమూరి బాలకృష్ణ కీలక నిర్ణయం..!

నందమూరి నటసింహం బాలకృష్ణ తన తరం హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కన్నా అధిక విజయాలు సాధిస్తూ, ఎక్కువ క్రేజ్ ను సొంతం చేసుకుంటూ టాప్ స్థానంలో నిలుస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందించారు. వాణిజ్య ప్రకటనలు, ఓటీటీ షోల ద్వారా ఈ స్టార్ హీరో అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు. ప్రస్తుతం బాలయ్య సినిమాలతో డిస్ట్రిబ్యూటర్లు లాభాలు కళ్లచూస్తుండటంతో వారినుంచి తీవ్ర డిమాండ్ నెలకొంటోంది.

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై దీన్ని నిర్మిస్తున్నారు. ఈ విజయ దశమికి దీన్ని విడుదల చేయాలనే యోచనతో నిర్మాత, దర్శకులున్నారు. షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. మళయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా ఓ కీలకపాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా సినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటూ వెళుతోన్న బాలయ్య ఈ నెలాఖరులోపు సినిమాలకు విరామం ప్రకటించాలనే కీలక నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

nandamuri balakrishna key decision

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతోపాటు తాను కూడా స్వయంగా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకోబోతున్నారంటున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు, హిందూపురంలో ప్రత్యేక ప్రచారం చేయాల్సి ఉండటంతో కొంతకాలం షూటింగ్ లు ఆపేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.

దీంతో దర్శకుడు బాబీ ఈ సమయంలో బాలకృష్ణ లేని సన్నివేశాలను పూర్తిచేయాలనే ఆలోచనతో ఉన్నారు. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సూపర్ క్రేజ్ తో రూ.30 కోట్ల పారితోషికం తీసుకుంటున్న బాలయ్య అదే రేంజ్ లో రాజకీయాల్లోను విజయం సాధిస్తాడనే ధీమాను అభిమానులు వ్యక్తపరుస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+