బాలయ్య లైనప్ లో 4 స్టార్ డైరెక్టర్లు
నటరత్న నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దీనితర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ వయసులో కూడా అంత వేగంగా బాలయ్య సినిమాలు చేస్తుండటంపై పరిశ్రమ ఆశ్చర్యంగా చూస్తోంది. బాబీ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చేయబోతున్నారు.
అఖండ2 తర్వాత బింబిసార్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. వశిష్ట బాలయ్యకు కథ వినిపించగా అది బాగా నచ్చిందని, బోయపాటి సినిమా తర్వాత దీన్ని తెరకెక్కించే యోచనలో బాలయ్య ఉన్నారు. ఇది కానీ లేదంటే అఖండ2 కానీ 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మితమయ్యే అవకాశం ఉంది. వశిష్ట దర్శకత్వంలో తీయబోయే సినిమా గీతా ఆర్ట్స్ పై నిర్మించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

వశిష్ట సినిమా తర్వాత పరశురామ్ దర్శకత్వంలో బాలయ్య నటించబోతున్నారు. కథ నచ్చిందని టాక్. నిర్మాత ఎవరనేది స్పష్టత రావాల్సి ఉంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని బాలకృష్ణ అతనికి మాటిచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవడం ఎప్పుడు అనేది చూడాలి. ఏదేమైనప్పటికీ బాబీ సినిమా తర్వాత బోయపాటితో, ఆ తర్వాత వశిష్టతో, ఆ తర్వాత పరశురామ్ తో, ఆ తర్వాత పూరీ జగన్నాథ్ తో... ఇలా వరుసపెట్టి స్పీడ్ గా సినిమాలు చేయడంచూసి పరిశ్రమలో అందరూ షాక్ కు గురవుతున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న చిత్రంలో బాలయ్య మూడు పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. పాత్రలు మూడు ఉంటాయా? లేదంటే త్రిపాత్రాభినయమా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications