నందమూరి బాలకృష్ణ 2 సంవత్సరాలు

తెలుగు సినిమా కథ రూపురేఖల్లో ఎన్ని మార్పులు వచ్చినా నేటికీ తెలుగు నేటివిటితో సినిమాలు తీసే హీరో నందమూరి బాలకృష్ణ. రికార్డులకి రారాజుగా కూడా అయన అభిమానులు పిలుచుకుంటుంటారు. తెలుగు సినిమా పరిశ్రమలో బాలయ్య సృష్టించిన ఎన్నో రికార్డులు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇప్పుడు బాలకృష్ణ సినిమాకి సంబంధించిన ఒక తాజా వార్త ఫిల్మ్ నగర్ లో టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం అఖండ. 2021 డిసెంబర్ 2 న విడుదలైంది. అంటే నేటికీ అఖండ వచ్చి సరిగ్గా రెండు సంవత్సరాలు అవుతోంది. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రజలు థియేటర్లకు వస్తారా? రారా? అనే మీమాంసలో చిత్ర పరిశ్రమ ఉండేది. అయితే అటువంటి సందర్భంలో విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. తెలుగు సినిమా 20 రోజులకి, 30 రోజులకి మాత్రమే పరిమితమవుతున్న వేళ అఖండ 103 కేంద్రాల్లో 50 రోజులు జరుపుకొని టోటల్ రన్ లో 130 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. ఆదోని ,ఎమ్మిగనూరు ,చిలకలూరి పేట ,కోయిల కుంట్ల లో శతదినోత్సవాన్ని జరుపుకుంది.

nandamuri balakrishna movie akhanda completed 2 years

మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. బాలయ్య సూపర్ నటనవల్లే అఖండ ఘన విజయం సాధించిందని చెప్పవచ్చు. అఘోరాగా, ప్రజల మంచి కోరుకునే సోషల్ వర్కర్ గా.. ఇలా రెండు కేరక్టర్స్ లో బాలయ్య నటన నభూతో నభవిష్యతి అనే విధంగా ఉంటుంది. ముఖ్యంగా అఘోరా క్యారక్టర్ లో బాలయ్య నటనకి, ఆ పాత్ర చెప్పే డైలాగులకు ప్రేక్షకులు పూనకం వచ్చినట్లు అయ్యారు. బాలయ్య నోటి వెంట వచ్చిన ఒక్కో డైలాగ్ ఒక్కో అణుబాంబు లాగా పేలింది. ఇంకో ఇరవై సంవత్సరాల తర్వాతైనా సరే అఖండ మూవీ ప్రేక్షకుల గుండెల్లో చెక్కు చెదరకుండా ఉండిపోతుందనేది విశ్లేషకుల మాట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+