మెగాస్టార్ ఆ రెండు సినిమాలు అంటే బాలయ్యకు అంత ఇష్టమా..?
నందమూరి నటసింహం బాలయ్యకి దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. తెరపై ఆయన మాస్ డైలాగ్స్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి భారీ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ నటవారసత్వాన్ని కొనసాగిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఒక వైపు రాజకీయంగా తన తండ్రి పెట్టిన తెలుగు దేశం పార్టీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ సాధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు సినిమాల్లో కూడా వరుసగా ఐదు సినిమాలు హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అలానే త్వరలోనే తన నెక్స్ట్ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు.
అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఒక జనరేషన్ ని అలరిస్తే.. ఆ తర్వాత తరంలో కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు మెప్పించారు. ఇక వారి తర్వాత వచ్చిన వారిలో బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ స్టార్ హీరోలుగా నిలిచారు. వెంకీ, నాగ్ క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్ లను అలరిస్తే.. బాలయ్య, చిరు మాస్ ప్రేక్షకులను ఫిదా చేసేశారు. నాటి నుంచి కూడా బాక్సాఫీస్ దగ్గర పోటీ అంటే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలే ఉండేవి.

మరీ ముఖ్యంగా ఎన్నో సంక్రాంతి పండుగలకు వీరి సినిమాలు విడుదలై ఒకదాని పైన ఒకటి విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఈ ఇద్దరి హీరోల అభిమానులు కూడా తమ హీరో గొప్ప అంటే.. తమ హీరో గొప్ప అంటూ గొడవలు పడ్డ సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ హీరోలు అంతా మేము మేము బాగానే ఉంటాం.. మీరు కూడా బాగుండాలి అంటూ అభిమానులకు పిలుపునిస్తూనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగాస్టార్ నటించిన ఆ రెండు సినిమాలు తనకు ఎంతో ఇష్టం అంటూ బాలయ్య వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.
ఏ ఏ సినిమాలు అంటే..
గతంలో ఓ ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ.. చిరు నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా తనకు చాలా ఇష్టమని చెప్పారు. తెలుగు సినిమా చరిత్రలో ఆ మూవీ ఒక ప్రత్యేక స్థానం సంపాదించిందని పొగడ్తలు కురిపించారు. ఆ సినిమా కథ, మేకింగ్, విజువల్స్ తనను చాలా ఆకట్టుకున్నాయని తెలిపారు. అలానే ఖైదీ సినిమా కూడా తనకు ఎంతో ఇష్టమని బాలకృష్ణ చెప్పారు. ఆ సినిమాలో చిరంజీవి చేసిన యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్‌లు బాగా నచ్చుతాయని ఓపెన్ అయ్యారు.
ప్రస్తుతం బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కుతుంది. NBK111 అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ నిర్మించానున్నారు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ కూడా చేశారు. దీన్ని గమనిస్తే బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని.. పిరియాడికల్ మైథాలజీ కాన్సెప్ట్ తో సినిమా రాబోతుందని భావిస్తున్నారు. అంతే కాకుండా బాలయ్య సినిమాకి మరోసారి తమన్ సంగీతం అందించబోతున్నారు. వృధ్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా.. లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది.
-
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్












Click it and Unblock the Notifications