అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !!

నందమూరి నటసింహం బాలయ్యకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో సైతం అభిమానులు ఉన్నారు. ఒక వైపు రాజకీయంగా తన తండ్రి పెట్టిన తెలుగు దేశం పార్టీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ సాధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు సినిమాల్లో కూడా వరుసగా ఐదు సినిమాలు హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఆయన మాస్ డైలాగ్స్ కి, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి భారీ ఫాలోయింగ్ ఉంది.

కాగా రీసెంట్ గానే దేశ రాజధాని ఢిల్లీ వేడుకగా 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ దిల్లీ (IFFD) 2026' వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలయ్యకు ప్రతిష్టాత్మక 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్' (జీవితకాల సాఫల్య) పురస్కారాన్ని అందజేశారు. దశాబ్దాలుగా సినిమా రంగానికి ఆయన చేసిన విశేష కృషిని గుర్తిస్తూ నిర్వాహకులు ఈ అవార్డుతో సత్కరించారు. ఈ వేడుకల్లో బాలకృష్ణతో పాటు ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్, దివంగత లెజెండరీ నటుడు ధర్మేంద్ర (ఆయన తరఫున కుటుంబసభ్యులు)ను కూడా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో గౌరవించారు. ముఖ్యమంత్రి రేఖాగుప్తా చేతులమీదుగా ఈ అవార్డులు ప్రధానం జరిగింది.అయితే ఈ వేడుకలో బాలయ్య అవార్డు తీసుకోవడం గురించి మాత్రమే కాకుండా మరో విషయం ఇప్పుడు సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

nandamuri-balakrishna-taking-blessings-from-actress-hema-malini-at-film-festival-and-video-goes-vira

ఈ కార్యక్రమం సందర్భంగా వేదికపై ఉన్న సీనియర్ నటి హేమమాలిని పాదాలకు నమస్కరించి తన సంస్కారాన్ని చాటుకున్నారు బాలకృష్ణ. ఇండస్ట్రీలో అగ్ర హీరోగా.. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ నాయకుడిగా ఎంతో హోదా ఉన్నప్పటికీ.. తనకంటే పెద్దవారైన నటి పట్ల ఆయన చూపిన వినయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఒక నటి కాళ్లకు బాలయ్య నమస్కరించడం ఆయన సంస్కారానికి నిదర్శనం ఆన్ నందమూరి ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు.

ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో విడుదలైన 'అఖండ 2' భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ.. ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. దాంతో బాలకృష్ణ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో మరో సినిమా తెరకెక్కించడానికి రెడీ అయ్యారు. NBK111 అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ నిర్మించానున్నారు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ కూడా చేశారు. బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని.. పిరియాడికల్ మైథాలజీ కాన్సెప్ట్ తో సినిమా రాబోతుందని తెలుస్తోంది. అంతే కాకుండా బాలయ్య సినిమాకి మరోసారి తమన్ సంగీతం అందించబోతున్నారు. వృధ్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా.. లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే బాలయ్య - గోపీచంద్ కాంబినేషన్ లో వచ్చిన వీర సింహారెడ్డి హిట్ కొట్టడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+