జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూసేందుకు రెండుసార్లు థియేటర్‌కు వెళ్లిన బాలయ్య
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నందమూరి నటసింహం బాలకృష్ణ మధ్య విభేదాలున్నాయంటూ నిత్యం వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై నందమూరి అభిమానులెవరూ స్పందించడంలేదు. బాలయ్య అభిమానులు తారక్ ను విమర్శిస్తుంటే, తారక్ అభిమానులు బాలయ్యపై విరుచుకుపడుతున్నారు. ఈ విభేదాలన్నీ వాస్తవమేనా? లేదంటే పుకార్లా? అనే సందేహంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నాయి. తాజాగా బాలయ్య అన్ స్టాపబుల్ షోకు బాబీ, నిర్మాత నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్ డాకూ మహారాజ్ ప్రమోషన్స్ కోసం వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తారక్ ప్రస్తావన రానివ్వడంలేదంటూ అతని అభిమానులు బాలకృష్ణపై మండిపడుతున్నారు.
కర్ఛీఫ్ కట్టుకొని థియేటర్ కు వెళ్లినట్లు చెప్పారు
దీనిపై దర్శకుడు బాబీ మాట్లాడుతూ అటువంటివేవీ లేవని, వచ్చేవార్తలన్నీ పుకార్లే అని కొట్టిపారేశారు. షోకు వెళ్లిన సమయంలో భోజనం చేసేటప్పుడు తాను తారక్ తో చేసిన జై లవకుశ సినిమా ప్రస్తావన వచ్చిందన్నారు. అప్పుడు బాలయ్య ఒక విషయం చెప్పారని, ఆ సినిమా తనకు బాగా నచ్చిందని, దాన్ని రెండుసార్లు థియేటర్ కు వెళ్లి చూశానని, ఎవరికీ కనపడకుండా టోపీ పెట్టుకొని, కర్ఛీఫ్ కట్టుకొని థియేటర్ కు వెళ్లినట్లు బాలయ్య చెప్పారని బాబీ వివరించారు. సోషల్ మీడియాలో బాలయ్య అభిమానులకు, తారక్ అభిమానులకు జరుగుతున్న వార్ ను ఆపాలని, వారిమధ్య ఎటువంటి గొడవలు లేవని బాబీ స్పష్టం చేశారు.

కిందకు లాగే ప్రయత్నం చేయొద్దు
అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని నమ్మడంలేదు. సంక్రాంతికి విడుదలవుతున్న డాకూ మహారాజ్ సినిమాను బాయ్ కాట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. తారక్ ను బాలయ్య ఏమాత్రం తొక్కలేడని, అతను ఇప్పటికే జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్నారని, పాన్ ఇండియా హీరో అయ్యాడంటున్నారు. అతని సినిమాలు అతను చేసుకుంటూ ఎంతో జాగ్రత్తగా కెరీర్ పై దృష్టిపెట్టి ముందుకు వెళుతున్నాడని, కిందకు లాగే ప్రయత్నం చేయొద్దంటున్నారు.












Click it and Unblock the Notifications