'భగవంత్ కేసరి' ప్రి రిలీజ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్?

అఖండ, వీర సింహా రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత బాలయ్య బాబు అనిల్ రావిపూడి తో 'భగవంత్ కేసరి' చిత్రం చేశారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 20 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతోంది. సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సినిమా టీజర్ ను ఇప్పటికే విడుదల చేశారు. అభిమానులతోపాటు ఆడియన్స్ నుంచి దీనికి మంచి స్పందన లభించింది.

నార్త్ అమెరికా లో 550 షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. సినిమా విడుదలకు ఇంకా 11 రోజుల సమయం ఉండటంతో రాబోయే రోజుల్లో బుకింగ్స్ ఉధృతంగా ఉండే అవకాశం కనపడుతోందంటున్నారు. సినిమా విడుదలయ్యేరోజే మరో రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. రవితేజ 'టైగర్ నాగేశ్వర రావు' తమిళ సినిమా 'లియో' (విజయ్) విడుదల కాబోతున్నాయి.

nandamuri balkarishna bhagavanth kesari pre release event

భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో జనసేన జతకట్టింది. కార్యక్రమాలు కూడా కలిసి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా నిలబడిన పవన్ కల్యాణ్ మరోసారి తన సపోర్ట్ ను అందిస్తున్నారు. అతిథిగా రావడంవల్ల మరోసారి బాలయ్యకు చేయి చాచినట్లు తెలుస్తోంది.

పవన్, బాలయ్య గతంలో'అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కే' ప్రోగ్రాం లో పాల్గొన్నారు. . వీళ్లిద్దరి మధ్య జరిగిన చిట్ చాట్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది. మాస్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ ఇద్దరు హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూసి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. మరోసారి అలాంటి సందర్భం భగవంత్ కేసరి వల్ల రాబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+