సంచలన విషయాన్ని ప్రకటించిన నరేష్-పవిత్రా లోకేష్

శాస్త్రవేత్తలు, పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విషయాలను కనుగొన్నారు. మరెన్నింటినో ఆవిష్కరించారు. అయితే ఈరోజువరకు వారికి అర్థం కాని విషయం ఏమిటంటే.. మనిషికి ప్రేమ ఎప్పుడు పుడుతుంది? అనే ప్రశ్నకు సమాధానం లేకపోవడం. సృష్టిలో ఎవరూ దీన్ని కనుక్కోలేకపోయారు. అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నరేష్, పవిత్రా లోకేష్ మధ్య ప్రేమ పుట్టడంపై అందరూ ఆశ్చర్యపోయారు. లేటు వయసులో ఘాటు రొమాన్స్ అవసరమా? అనేవారు కూడా ఎందరో ఉన్నారు. కానీ ఇటువంటి విమర్శలను వారు పట్టించుకోలేదు.

లిప్ లాక్ పెట్టుకున్న సన్నివేశం
కొద్దిరోజులు ప్రేమించుకున్న తర్వాత వివాహం చేసుకొని అందరికీ గుండెపోటు వచ్చేంత షాక్ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో వీరిద్దరి వివాహం సంచలనాన్ని కలిగించింది. అప్పటికే పెళ్లిళ్లలో నరేష్ హ్యాట్రిక్ కొట్టాడు. వీరిద్దరిపై నరేష్ మూడో భార్య రమ్యరఘుపతి కేసు పెట్టింది. ఈ జంట లిప్ లాక్ పెట్టుకున్న ఎన్నో వీడియోలు బయటకు వచ్చాయి. అయితే అదంతా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేశారు. మళ్లీపెళ్లి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పిల్లల్ని కంటామని చెప్పారు.

naresh and pavitra lokesh comment on In terms of bearing children

డబ్బుల కోసమేనంటూ..
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్ర-నరేష్ అందరికీ షాకిచ్చేలా కామెంట్లు చేశారు. తాము పిల్లల్ని కనాలనుకోవడంలేదని, ఇప్పటికే ఉన్న పిల్లలు తమ పిల్లలేనని ప్రకటించారు. తమ ఆస్తి వారికే చెందుతుందన్నారు. దీంతో ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఏంటి.. వీళ్లిద్దరూ ఇలా మారిపోయారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పిల్లల్ని కనే విషయంలో ఇద్దరి మధ్య ఏమైనా విభేదాలు తలెత్తాయా? కొద్దిరోజులు కలిసివుండి తర్వాత విడిపోవాలనుకుంటున్నారా? అంటూ చర్చించుకుంటున్నారు. నరేష్ వద్ద రూ.1500 కోట్ల ఆస్తి ఉండటంతోనే అతనితో సహజీవనం చేస్తోందని, అంత డబ్బు ఉండటమే కారణమని పవిత్ర మాజీ భర్త ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+