తెలుగులో నెవర్ బిఫోర్ మల్టీస్టారర్ మూవీ.. హీరోయిన్‌గా రష్మిక
దక్షిణ భారతదేశం నుంచి హీరోయిన్ గా ఉంటూ పాన్ ఇండియా హీరోయిన్ స్థాయికి ఎదిగారు రష్మిక మందన్నా. ఈ క్రమంలో నేషనల్ క్రష్ అనే బిరుదును సంపాదించుకున్నారు. రష్మిక చేస్తున్న సినిమాలన్నీ హిట్ అవుతుండటంతో గెల్డెన్ లెగ్ అనే పేరు స్థిరపడిపోయింది. జాగ్రత్తగా కథలను ఎంచుకుంటూ సినిమాలను చేసుకుంటూ వస్తున్నారు. జాతీయస్థాయిలో సంచలనం సృష్టించిన యానిమల్, పుష్ప సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం పుష్ప2తోపాటు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది. సినిమాకు రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందని, త్వరలోనే వివాహం చేసుకుంటారనే వార్త మాత్రం ఎప్పటినుంచో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
తాజాగా ఈ అమ్మడు తెలుగులో మరో సినిమాను ఒప్పుకుంది. తెలుగులో తన మొదటి హీరో నాగశౌర్య, విభిన్న పాత్రలను పోషిస్తున్న దుల్కర్ సల్మాన్ హీరోలుగా నటిస్తున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. ప్రముఖ నిర్మాత చెరుకూరి సుధాకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే పూజా కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. కొత్త దర్శకుడు రవి ఈ చిత్రంద్వారా పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. యథార్థ సంఘటనలను ఆధారంగా చేసుకొని కథను రాసుకున్నారని,
ఈ ముగ్గురికి ఇది విభిన్నమైన సినిమా అవుతుందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.

కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరజ్‌పేట్‌లో జన్మించిన రష్మిక ఏప్రిల్ 5,1996లో జన్మించారు. కూర్గ్ పబ్లిక్ స్కూల్లో విద్యనభ్యసించారు. M.S.రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని సంపాదించారు. తెలుగు పరిశ్రమకు ఛలో సినిమా ద్వారా పరిచయమయ్యారు. ఇందులో నాగశౌర్య హీరోగా నటించాడు.












Click it and Unblock the Notifications